భ‌ర్త‌ప‌ట్ల గ‌ర్వంగా ఫీల‌వుతోన్న హీరోయిన్!

మీరు ఈరోజు కేవలం ఒక ఎంపీగా మాత్రమే మాట్లాడలేదు. మన బిడ్డకు నేను ప్రతిరోజూ చూస్తున్న ఆదర్శవం తమైన తండ్రిగా మాట్లాడారు` అని పేర్కొన్నారు.;

Update: 2026-04-02 02:45 GMT

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా పార్ల‌మెంటులో గ‌ళ‌మెత్తుతోన్న తీరుతో కేంద్రం గ‌జ‌గ‌జ‌లాడుతోంది.ఎవ్వ‌రూ లేవ‌నెత్త‌ని ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తూ అధికార ప‌క్షానికి ఒక్క‌డిగా చుక్క‌లు చూపిస్తున్నాడు. బ‌డుగు, బ‌లహీన వ‌ర్గాల ప‌క్షాన చ‌ద్దా నిల‌బ‌డిన తీరుకు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. చివ‌రికి అధికార ప‌క్షం స‌మాధానాలు చెప్ప‌లేక చ‌ద్దాను స‌మావేశాల నుంచి తాత్కాలిక‌ బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. తాజాగా గ‌డువు ముగిసిన నేప‌థ్యంలో మ‌ళ్లీ య‌ధావిధిగా స‌మావేశాల‌కు అటెండ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా పితృత్వ సెలవుల అంశంపైనా త‌న‌దైన తీరులో విరుచ‌కు ప‌డ్డారు చ‌ద్దా.

శిశువు జన్మించినప్పుడు తల్లితో పాటు తండ్రి బాధ్యత కూడా ఎంతో ముఖ్యమని పిల్లల పెంపకం అనేది కేవలం తల్లికి మాత్రమే సంబంధించినది కాదని ఇద్దరు తల్లిదండ్రులు కలిసి పంచుకోవాల్సిన బాధ్యత అని రాఘవ్ చద్దా పార్లమెంటులో గట్టిగా వాదించారు. ఈ అంశంపై ఆయన చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా భ‌ర్త ప్ర‌సంగంపై నటి పరిణీతి చోప్రా గర్వాన్ని వ్యక్తం చేశారు. పరిణీతి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాఘవ్ చద్దా ప్రసంగం తాలూకు వీడియోను పంచుకుంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

`మీరు ఈరోజు కేవలం ఒక ఎంపీగా మాత్రమే మాట్లాడలేదు. మన బిడ్డకు నేను ప్రతిరోజూ చూస్తున్న ఆదర్శవం తమైన తండ్రిగా మాట్లాడారు` అని పేర్కొన్నారు. శిశువు జననం అనేది కేవలం ఒక తల్లికి మాత్రమే కాదు. ఒక తండ్రికి కూడా కొత్త జన్మనిస్తుందన్న‌ విషయాన్ని పార్లమెంటు వంటి కీలక వేదికపై రాఘవ్ చర్చకు పెట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని` తెలిపారు. చాలా మంది తల్లులు తమకు కుటుంబం నుండి లేదా సమాజం నుండి తగిన మద్దతు లేక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని, అలాంటి వారి కష్టాన్ని రాఘవ్ పార్లమెంటు దృష్టికి తీసుకు రావడం అభినందనీయమని పరిణీతి కొనియాడారు. పేరెంటింగ్ అనేది పంచుకోవాల్సిన బాధ్యత అని అది ఎవరికో ఒకరికి కేటాయించబడింది కాదని ఆమె గుర్తు చేశారు.

పరిణీతి - రాఘవ్ చద్దా దంపతులకు గ‌త ఏడాది `నీర్` అనే కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. రాఘవ్ ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, ఇంట్లో ఎటువంటి విజ్ఞప్తి లేకుండానే బిడ్డ పెంపకంలో తన వంతు సహకారాన్ని అందిస్తారని ఈ సంద‌ర్భంగా పరిణీతి ఎంతో మురిసిపోయారు. భర్తగా, ఒక నాయకుడిగా ఆయన చేస్తున్న ప్రయ త్నాలు ఇప్పుడు ఎంతో మంది కొత్త తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాఘవ్ చద్దా పార్లమెంటులో డిమాండ్ చేసిన ఈ పితృత్వ సెలవుల చట్టం, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సానుకూల మార్పులకు దారితీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమాజంలో మగవారి పాత్రను, బాధ్యతను గుర్తించడంలో ఈ చర్చ ఒక కీలక మలుపుగా నిలవనుంది. పౌరుల సమస్యలను, ముఖ్యంగా సామాజిక అంశాలను ఇలాంటి కీలక వేదికలపై చర్చించడం పట్ల రాజకీయ విశ్లేషకులు కూడా రాఘవ్ చద్దాను అభినందిస్తున్నారు.

Tags:    

Similar News