• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధనుష్ Vs నయన్.....

ధనుష్ Vs నయన్.. డాక్యుమెంటరీలో రాధిక కీలక వ్యాఖ్యలు!

| ఈ కాంట్రవర్సీ మధ్య నవంబర్ 18న ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

By - Tupaki Desk
Update: 2024-11-19 09:31 GMT

ధనుష్ Vs నయనతార వివాదం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతోంది. నెట్ ఫ్లిక్స్ రూపొందించిన తన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' ను అడ్డుకోడానికి ఉద్దేశ్యపూర్వకంగా ధనుష్ అనుమతి ఇవ్వలేదంటూ నయన్ సోషల్ మీడియాలో మూడు పేజీల బహిరంగ లేఖ రాసింది. ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాలోని విజువల్స్ ను తన డాక్యుమెంటరీలో ఉపయోగించుకోడానికి అతను ఎన్ఓసీ ఇవ్వలేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఈ కాంట్రవర్సీ మధ్య నవంబర్ 18న ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీని ద్వారా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా టైంలోనే డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌, నయనతార మధ్య ప్రేమ చిగురించిందనే సంగతి తెలిసిందే. ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో నటి రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీలో రాధిక మాట్లాడిన వీడియో బైట్ ను కూడా పొందుపరిచారు. నయన్-విఘ్నేష్ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని తెలుసుకొని ధనుష్ ఎంత షాక్ అయ్యాడనే విషయాన్ని రాధిక వెల్లడించింది. ధనుష్ ద్వారానే వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందని చెప్పింది. ఆ సమయంలో ధనుష్ కు తనకు మధ్య జరిగిన కన్వర్జేషన్ ను పంచుకుంది.

రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ''యాక్చువల్ గా ధనుష్ వల్లే నాకు తెలిసింది. ధనుష్ నాకు ఒకరోజు ఫోన్ చేసి, 'అక్కా.. మీకు సిగ్గు మానం లేదా?' అని అడిగాడు. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయి 'ఏం అంటున్నావ్?' అని అడిగాను. 'ఏంటి అక్కా.. ఏం జరుగుతుందో నిజంగా మీకు తెలియదా?' అని ప్రశ్నించాడు. 'మీకు తెలుసా.. నయన్, విఘ్నేష్ డేటింగ్ చేస్తున్నారు' అని చెప్పాడు. నేను షాకై 'ఏం చెప్తున్నావ్.. నాకు అసలు ఏం తెలియదు' అని అన్నాను'' అని డాక్యుమెంటరీలో నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి రాధిక శరత్ కుమార్ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. నయనతార - విఘ్నేష్ శివవ్ లవ్ లో ఉన్నారనే సంగతి ధనుష్ చెప్తేనే తనకు తెలిసిందని తెలిపింది. ''ధనుష్ కాల్ చేసి 'అక్కా.. షూటింగ్ ఎలా జరుగుతోంది?' అని అడిగితే.. బాగానే జరుగుతోంది అని చెప్పాను. 'బాగానే జరుగుతోందా?.. నీకు ఒక విషయం తెలుసా అక్కా?' అని అడిగాడు. ఏంటి ధనుష్ అని అడిగితే.. 'నయన్ - విక్కీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారంట. నీకు తెలియదా?' అని ప్రశ్నించాడు. 'హే.. కథలు చెప్పకు.. నేనూ షూటింగ్ లో ఉండేది' అన్నాను. 'అలా చెప్పడానికి సిగ్గు లేదా అక్కా.. ఇంత జరుగుతున్నా మీకు తెలియదా' అని ధనుష్ అన్నాడు. 'ఏం చెప్తున్నావ్.. నాకు నిజంగానే తెలియదు'' అంటూ షాక్ అయ్యానని రాధిక చెప్పింది. నయన్ - విఘ్నేష్ ఇద్దరూ చాలా ప్రొఫెషనల్ అని చెప్పుకొచ్చింది.

అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, రానా దగ్గుబాటి, విజయ్ సేతుపతి, తమన్నా భాటియా, పార్వతి తిరువోతు, అట్లీ లాంటి మరికొందరు సినీ ప్రముఖులు నయనతార డాక్యుమెంటరీలో కనిపించారు. ఆమె గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే నయన్ - విఘ్నేష్ లైఫ్ లో ముఖ్యమైన 'నేనూ రౌడీనే' సినిమా విజువల్స్ వాడుకోడానికి నిర్మాత ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. 3 సెకండ్ల బీటీఎస్ వీడియోని ట్రైలర్ చూపిస్తే, 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపినట్లుగా నయన్ ఓపెన్ లెటర్ రాసింది. ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత, 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' ఫిలింలో ఈ మూవీ విజువల్స్ ను ఉపయోగించడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Tags:    
  • Tollywod 
  • Kollywood 
  • Filmindustry 
  • Nayantharadocumentary 
  • Netflix 
  • Nayanthara 
  • Dhanush 
  • Radhikasarathkumar 
  • Comments 
  • Interview 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS