ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన రాధిక
రీసెంట్ గా సిస్టర్ మిడ్ నైట్ తో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఇండియాలో రిలీజవుతున్న సందర్భంగా రాధికా మీడియా ముందుకొచ్చి ఆ సినిమాను ప్రమోట్ చేస్తోంది.;
టాలీవుడ్ ప్రేక్షకులకు లెజెండ్, రక్త చరిత్ర, లయన్ సినిమాలతో రాధికా ఆప్టే పరిచయమే. బాలీవుడ్ లో పలు బోల్డ్ పాత్రల్లో నటించి బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాధికా ఆప్టే రీసెంట్ గా సిస్టర్ మిడ్ నైట్ తో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఇండియాలో రిలీజవుతున్న సందర్భంగా రాధికా మీడియా ముందుకొచ్చి ఆ సినిమాను ప్రమోట్ చేస్తోంది.
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన కారణంగా ఎప్పుడు దేని గురించి ఎలాంటి వార్త వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. అంతేకాదు, ఆ వార్తల్లో ఏ మేరకు నిజానిజాలున్నాయనేది కూడా కనీసం పట్టించుకోకుండా నెటిజన్లు వాటిని ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్నాళ్లుగా రాధికా ఆప్టేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా రూపొందనున్న సినిమాలో రాధికా ఆప్టే నటిస్తుందని వార్తలు జోరుగా వినిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తను చిత్ర మేకర్స్ విని కూడా సైలెంట్ గా ఉండటంతో అది నిజమేనని అందరూ అనుకుంటున్నారు. రీసెంట్ గా మీడియా ముందుకొచ్చిన రాధికే ఆప్టేకు దానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
దానికి రాధికా స్పందిస్తూ, తాను కూడా ఈ వార్త విన్నానని, పూరీ- సేతుపతి సినిమాలో తాను లేనని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ సినిమా విషయం తనకు తెలియదని, న్యూస్ పేపర్లు, వెబ్ సైట్స్ లో చూసి తాను కూడా షాకయ్యానని చెప్పింది. కాబట్టి ఈ సినిమాలో రాధికే లేదనే వార్త ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్టే. మరి రాధికా ఆప్టే ప్లేస్ లో పూరీ ఎవరిని రంగంలోకి దింపుతాడో చూడాలి.
ఇప్పటివరకు పూరీ- సేతుపతి సినిమాలో టబు, దునియా విజయ్ నటిస్తున్నారనే విషయంలో మాత్రమే అధికారికంగా అనౌన్స్‌మెంట్ వచ్చింది. నివేదా థామస్ నటిస్తుందంటున్నారు కానీ ఈ విషయంలో కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. మంచి ఆర్టిస్టుల కోసం పూరీ వెతుకున్నాడని, అందుకే ఎక్కువ టైమ్ పడుతుందని పూరీ సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం పూరీ ఆర్టిస్టులను వెతికే పనిలోనే బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విషయంలో పూరీ ఎంతో కసిగా ఉన్నట్టు తెలుస్తోంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని పూరీ చూస్తున్నాడు. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.