• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప-2.. కెరీర్ లో ఫస్ట్...

పుష్ప-2.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ బన్నీ ఇలా..

| పుష్ప పార్ట్ 1 వచ్చి మూడేళ్లు అవుతుంది. దీంతో పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-01-31 00:30 GMT

పుష్ప సినిమాతో హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం సంగతి తెలిసిందే. పాటలు, డైలాగ్స్ తో తగ్గేదేలే అంటూ వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు పుష్ప రాజ్. తన నటనతో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్ హవా మరింత పెరిగింది. ఇక పుష్ప సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

పుష్ప పార్ట్ 1 వచ్చి మూడేళ్లు అవుతుంది. దీంతో పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఇటీవల చిత్ర యూనిట్ మరోసారి అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అంచనాలు మరిన్ని పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్.. హైదరాబాద్ లోని ఫేమస్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.

గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడుద్దని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. షూటింగ్ చాలా పెండింగ్ ఉందని, అందుకే క్రిస్మస్ కు థియేటర్లలోకి వస్తుందని టాక్ వినిపించింది. వాటిని చిత్ర యూనిట్ ఖండించి క్లారిటీ ఇచ్చింది. అయితే బన్నీ మాత్రం ఆగస్టు 15వ తేదీనే సినిమా రిలీజ్ చేయాలని పట్టుబట్టారట. ఈ మూవీ కోసం తన కెరీర్ లోనే అత్యధిక డేట్స్ ఇచ్చారట. పుష్ప-2 ఇంక వాయిదా పడకూడదని శరవేగంగా పనులు జరగాలని చెప్పారట.

ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. హీరో అంటే ఇలా ఉండాలని అంటున్నారు. ఆగస్టు 15వ తేదీన తగ్గేదేలే అంటూ ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ లోనూ అల్లు అర్జున్ సరసన రష్మికనే నటిస్తోంది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో మూవీ యూనిట్ ఓ క్రేజీ అప్డేట్ ఇవ్వనుందట.

కాగా, ఈ మూవీకి నార్త్ బెల్ట్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ హైప్ ను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ సుకుమార్ సినిమాపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతోపాటు రీషూట్ల మీద రీషూట్లు చేస్తున్నారట. ఫ్యాన్స్ నిరాశ చెందకుండా వాళ్ల అంచనాలను అందుకునేలా పుష్ప 2 తీసుకురావాలని సుకుమార్ పట్టుదలతో ఉన్నారట. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.





 


Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Mythrimoviemakers 
  • Devisriprasad 
  • August15 
  • Release 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS