అన్ని చోట్లా బ‌న్నీ దుమ్ము దుమార‌మే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప‌2' బాలీవుడ్ ని సైతం ఏ రేంజ్ లో షేక్ చేసిందో తెలిసిందే.;

Update: 2025-06-16 11:26 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప‌2' బాలీవుడ్ ని సైతం ఏ రేంజ్ లో షేక్ చేసిందో తెలిసిందే. ఓ తెలుగు సినిమా ఏకంగా హిందీ బాక్సాఫీస్ రికార్డుల‌ను సైతం చెరిపేసి స‌రికొత్త చ‌రిత్ర రాసింది. ఒక్క 'దంగ‌ల్' త‌ప్ప మిగ‌తా అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయి. థియేట్రిక‌ల్ గా సాధించిన స‌క్సెస్ ఇది. ఇక ఓటీటీ ...శాటిలైట్ బిజినెస్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. అటుపై రిలీజ్ అనంత‌రం అక్క‌డ గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

శాటిలైట్ ప‌రంగా 'పుష్ప 2' హిందీ లో రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఏంగా 5.1 టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింది. ఓ ప్ర‌ముఖ హిందీ టెలివిజ‌న్ ఛాన‌ల్ లో ప్రసారం కాగా ఈ ఫీట్ సాధించింది. మ‌రో విశేషం ఏంటంటే? ఐపీఎల్ ను కూడా బీట్ చేసింది. రీసెంట్ ఐపీఎల్ యావ‌రేజ క‌న్నా 'పుష్ప2' హైలో క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ బాలీవుడ్ సినిమాకు ఈ రేంజ్ లో టీఆర్పీ ద‌క్క‌లేదు. దీంతో శాటిలైట్ బాసులు సైతం షాక్ అవుతున్నారు.

పెద్ద తెర‌పైన‌పే కాదు..చిన్న పెర తెర‌పైనా మ‌రోసారి ఓ తెలుగు హీరో స‌త్తా చాటాడ‌ని మాట్లాడుకుంటు న్నారు. టీఆర్పీ రేటింగ్ తో వాళ్లంతా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో వేసిన ఏ హిందీ సినిమాకు ఈ రేంజ్ లో టీఆర్పీ రాలేద‌ని వాళ్లే దిగొచ్చి చెబుతున్నారు. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్ హైప్ 'అఖండ 2'కి ఉంది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ లో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది.

హిందీ బుల్లి తెరపై అఖండ పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గానే అఖండ 2 రిలీజ్ అవుతుండ‌టంతో ఓటీటీ..శాటిలైట్ ప‌రంగా పెద్ద ఎత్తున బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. బాల‌య్య మాస్ అప్పిరియ‌న్స్...హిందుత్వం కాన్సెప్ట్ తో నార్త్ కి ఆడియ‌న్స్ ఈ సినిమా బాగా క‌నెక్ట్ అవుతుంది.

Tags:    

Similar News