థియేటర్లలో ‘పురుషః'రచ్చ.. సక్సెస్ ఖుషీలో చిత్రయూనిట్ గ్రాండ్ థాంక్యూ మీట్!

ఈ రేంజ్ సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్‌కి, మీడియాకి థాంక్స్ చెప్పడానికి శనివారం నాడు చిత్రయూనిట్ ఒక గ్రాండ్ ‘థాంక్యూ మీట్’ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో సినిమా టీమ్ పంచుకున్న ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం..

Update: 2026-05-24 12:48 GMT

కొత్త నటీనటులతో, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘పురుషః ' సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. మే 22న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ బాగుండటంతో థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ రేంజ్ సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్‌కి, మీడియాకి థాంక్స్ చెప్పడానికి శనివారం నాడు చిత్రయూనిట్ ఒక గ్రాండ్ ‘థాంక్యూ మీట్’ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో సినిమా టీమ్ పంచుకున్న ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం..



 


నా నటనకు మా మాస్టారే కారణం:

హీరో పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. "సినిమాను సపోర్ట్ చేసిన మీడియాకు పెద్ద థాంక్స్. నేను వైజాగ్ సత్యానంద్ మాస్టార్ గారి దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నాను. కానీ, ఫస్ట్ సినిమా కదా.. ఒకవేళ నేను బాగా చేయకపోతే ఆయన పేరు పాడవుతుందని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పలేదు. ఇప్పుడు నా నటనకు మంచి పేరు వస్తోంది కాబట్టి, నేను ఆయన శిష్యుడినని గర్వంగా చెప్పుకుంటున్నాను. సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న, హీరోయిన్లు రాయంచ, విషిక, హాసిని నాకు చాలా సపోర్ట్ చేశారు. నా యాక్టింగ్‌లో ఏవైనా మైనస్‌లు ఉంటే చెప్పండి, నెక్స్ట్ సినిమాల్లో మార్చుకుంటాను" అని మనసులో మాట చెప్పారు.

మా అబ్బాయి యాక్టింగ్ నాకే నచ్చింది:

ఇక చిత్ర నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. "మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. హీరోయిన్లు ముగ్గురు చాలా బాగా చేశారు. సప్తగిరి, కసిరెడ్డి ల యాక్టింగ్ అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ బత్తులని హీరోగా పెట్టి సినిమాలు తీస్తామని నాకంటే పెద్ద కోటీశ్వరులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇక కానీ నేనే మా అబ్బాయితో ఇంకో రెండు సినిమాలు తీస్తానని వాళ్లకు చెప్పాను. పవన్ ఎక్కడా కొత్త హీరోలా కాకుండా, చాలా బాగా యాక్ట్ చేశాడు, సినిమా బాగుంది" అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

రెండు నెలలు ప్రాక్టీస్ చేశాడు:

దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ ప్రొడ్యూసర్ సపోర్ట్‌ని గుర్తుచేసుకున్నారు. "నిర్మాత కోటేశ్వరరావు గారు ఎక్కడా తగ్గకుండా సినిమా కంప్లీట్ చేసారు. బత్తుల సరస్వతి గారి సహకారం మరువలేనిది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఒక పిల్లర్‌లా నిలబడ్డాడు. ఇక సినిమా షూటింగ్ కంటే ముందే రెండు నెలలు వర్క్‌షాప్ చేసి, ప్రతి సీన్‌ని ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేశాడు. అందుకే స్క్రీన్ మీద కొత్త కుర్రాడిలా అనిపించడు. ఈ మూవీ లో అందరు ప్రాణం పెట్టి పనిచేశారు" అని చెప్పారు.

కసిరెడ్డి రాజ్ కుమార్:

పవన్ విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ నటుడు కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడుతూ .. "పవన్ కళ్యాణ్ చాలా మంచివారు, కొంచెం సిగ్గు స్వభావం ఎక్కువ. ఫస్ట్ సినిమా లాగా అనిపించకూడదు, గట్టిగా ట్రై చెయ్ అని పవన్‌కు ముందే చెప్పాను. తను అనుకున్నట్టే సక్సెస్ అయ్యాడు. నాలుగేళ్ల నుంచి నాకు పరిచయం ఉన్న డైరెక్టర్ వీరు గారు నన్ను గుర్తుపెట్టుకొని ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్. కెమెరామెన్ సతీష్ గారు బడ్జెట్‌ను కంట్రోల్‌లో పెడితే, ఆర్ట్ డైరెక్టర్ రవి గారు సెట్‌లో ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ తెచ్చేవారు" అని అన్నారు.

మా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగింది:

ఇక కెమెరామెన్ సతీష్ మాట్లాడుతూ.. "నిర్మాత కోటేశ్వరరావు గారు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రిచ్‌గా తీశారు. పవన్‌కు ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది" అనగా.. ఆర్ట్ డైరెక్టర్ రవి మాట్లాడుతూ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, కష్టపడి పనిచేసిన చిత్ర యూనిట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

హీరోయిన్ విషిక:

ఈమె మాట్లాడుతూ "ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నుంచి మా సినిమాకు చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్స్. సినిమా చూసిన వాళ్లు మళ్లీ చూడండి, చూడని వాళ్లు వెంటనే వెళ్ళండి" అని పిలుపునిచ్చారు.

హీరోయిన్ రాయంచ:

ఆమె మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. మీడియా మొదటి నుంచి మాకు సపోర్ట్‌గా నిలిచింది. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.

హీరోయిన్ హాసిని సుధీర్:

ఇక మరో హీరోయిన్ మాట్లాడుతూ "సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. మీడియా ప్రమోషన్స్ వల్ల సినిమా జనాల్లోకి బాగా వెళ్లింది. అందరూ థియేటర్లలో చూసి మూవీ ఎంజాయ్ చేయండి" అని కోరారు.

నటి సంధ్య మాట్లాడుతూ "ఈ సినిమాలో నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి నా థాంక్స్" అని చెప్పారు.

చిన్న సినిమాగా వచ్చి, థియేటర్లలో పెద్ద సక్సెస్ అందుకున్న ‘పురుషః ' మూవీ టీమ్ అంతా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక హోల్సమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ఈ సినిమాను ఇంకా ఎవరైనా చూడకపోతే.. వెంటనే మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి..l

Tags:    

Similar News