పురుష ట్రైలర్.. సమ్మర్‌ లో సరైన సినిమాలా ఉందే..

అయితే సినిమా కేవలం కామెడీతోనే కాకుండా ఎమోషన్స్ తో కూడా నడవబోతున్నట్టు ట్రైలర్‌ లో స్పష్టమైంది. 'ప్రేమ ఉన్న చోట నిజాయితీ ఉంటుంది' అనే డైలాగ్‌ తో కథలో ఎమోషనల్ యాంగిల్‌ చూపించారు.

Update: 2026-05-19 07:14 GMT

ఇటీవల కాలంలో కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పురుష:. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఆ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహించారు.

పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్న ఆ సినిమాలో సప్తగిరి, వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మే 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్‌ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా సాగింది.

'బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది' అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్‌ తో ట్రైలర్ మొదలవుతుంది. పెళ్లి తర్వాత భర్తలు ఎదుర్కొనే పరిస్థితులు సరదాగా చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ముగ్గురు ప్రధాన పాత్రల జీవితాల్లో పెళ్లి తర్వాత వచ్చిన మార్పులు, భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు, వాటి వల్ల వచ్చే సమస్యలను ఫన్నీగా ప్రజెంట్ చేశారు. ఇంట్లో శాంతి లేక కోర్టు వరకు వెళ్లే పరిస్థితులు హైలెట్‌ గా నిలిచాయి.

అయితే సినిమా కేవలం కామెడీతోనే కాకుండా ఎమోషన్స్ తో కూడా నడవబోతున్నట్టు ట్రైలర్‌ లో స్పష్టమైంది. 'ప్రేమ ఉన్న చోట నిజాయితీ ఉంటుంది' అనే డైలాగ్‌ తో కథలో ఎమోషనల్ యాంగిల్‌ చూపించారు. 'ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ.. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోతోంది' వంటి డైలాగ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి.

దర్శకుడు వీరు వులవల వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు కామెడీగా చూపిస్తూనే, కుటుంబ బంధాలు విలువను చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో కనిపించే సూపర్ హీరో తరహా ఎలిమెంట్ మరింత క్యూరియాసిటీ పెంచింది. హీరోగా పరిచయం అవుతున్న పవన్ కళ్యాణ్ బత్తుల ట్రైలర్‌ లో కాన్ఫిడెంట్‌ గా కనిపించారు. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

మరోవైపు సప్తగిరి, వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజ్‌కుమార్ కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచేలా కనిపిస్తోంది. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ పాత్రలు కూడా కథలో ప్రాధాన్యత కలిగినట్లుగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అనంత్ శ్రీరామ్ లాయర్ పాత్రలో కనిపించడం విశేషం. సాంకేతికంగా సినిమా మంచి స్థాయిలో తెరకెక్కినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల విజువల్స్‌ ను కలర్‌ ఫుల్‌ గా చూపించారు. శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ కు మంచి ఎనర్జీ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే పురుష: సినిమా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకులు లైట్ హార్టెడ్ సినిమాలకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న వేళ ఆ చిత్రం సరైన సమయంలో వస్తుందని చెప్పాలి. సమ్మర్ సీజన్‌ లో నవ్వులు పంచే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా పురుష ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Full View
Tags:    

Similar News