పురుష: మూవీ రిలీజ్.. సరైన డేట్ పట్టేశారా?
ఫ్యామిలీ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించే చిత్రంగా తెరకెక్కుతున్న పురుష: ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.;
ఫ్యామిలీ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించే చిత్రంగా తెరకెక్కుతున్న పురుష: ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఆ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్, టీజర్, పాటలు, పోస్టర్లు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి..
ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథాంశంతో మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్, తాజాగా మే 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. వేసవి సెలవుల సీజన్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించే లక్ష్యంతో రిలీజ్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పెద్ద సినిమాల పోటీ తక్కువగా ఉండటం కూడా పురుష: చిత్రానికి కలిసొచ్చే అంశంగా అంతా భావిస్తున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆ చిత్రం మంచి ఆప్షన్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆ సినిమా ప్రారంభం నుంచే వినూత్న ప్రమోషన్లతో ఆకట్టుకుంటోంది. ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.
అలాగే టీజర్ లో చూపించిన కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సరదా డైలాగులు, ఫన్నీ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన ఆ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా మూవీ కనెక్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని మరింత పెంచేందుకు రెడీ అవుతోంది. త్వరలో విడుదలయ్యే ట్రైలర్ సినిమాపై అంచనాలను ఇంకా పెంచుతుందని చెబుతోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే సినిమా మంచి ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సప్తగిరి, వెన్నెల కిషోర్ వంటి కామెడీ నటులు సినిమాలో ఉండటం కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
చిత్రంలో పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో నటీనటులందరూ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం. సాంకేతిక విభాగంలో కూడా సినిమా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యత సతీష్ ముత్యాల నిర్వహిస్తున్నారు. ఎడిటర్ గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు. అనంత శ్రీరామ్ పాటల రచన అందిస్తున్నారు. కలర్ ఫుల్ విజువల్స్, ఎంటర్టైనింగ్ స్టోరీ, ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే అంశాలతో పురుష: మూవీ సమ్మర్ లో ఎలాంటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి