తేజ సజ్జా - పూరి.. మళ్ళీ ఆగిపోయిన కథేనా?

అసలైతే ఇంతకుముందు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయాలని అనుకున్నాడు.

Update: 2024-05-15 06:27 GMT

డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరో కొత్త సినిమాను ఎనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు అయితే వైరల్ గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్న పూరీ వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వెంటనే మరొక ప్రాజెక్టును కూడా మొదలు పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది..

అసలైతే ఇంతకుముందు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. వీరి కలయికలో వచ్చిన లైగర్ సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఆ సినిమా విడుదల కాకముందే పూరి జగన్నాథ్ విజయ్ ఇద్దరు కూడా జనగణమన అనే ప్రాజెక్టును స్టార్ట్ చేశారు.

కొంత షూటింగ్ కూడా జరిగింది. ఇక తర్వాత లైగర్ సినిమా ఊహించిన రిజల్ట్ అందుకోవడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు దర్శకుడు పూరి యువ హీరో తేజ సజ్జా తో సినిమా చేయాలి అనే చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ హీరో డైరెక్టర్ ను కలిసినట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. తేజా కూడా ప్రస్తుతం డిఫరెంట్ కథలతో సిద్ధమవుతున్నాడు.

తన మార్కెట్ను పెంచుకోవడానికి అతను అనుభవజ్ఞులైన దర్శకులతో కూడా చర్చలు జరుపుతూ ఉండడం విశేషం. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ చెప్పిన కథకు అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నట్లు కూడా ఒక టాక్ అయితే నడుస్తోంది. ఇక ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు.. పూరీ జగన్నాథ్ ఎప్పటినుంచో తెరపైకి తీసుకురావాలి అని అనుకుంటున్న 'జనగణమన' అని తెలుస్తోంది.

Read more!

మొదట్లో దీన్ని పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు కూడా వినిపించారు. కానీ వారిద్దరూ చర్చలు దశలోనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇక ఫైనల్ గా విజయ్ దేవరకొండ తో షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ తేజ తో అదే కథను తెరపైకి తీసుకువచ్చి సాలిడ్ సక్సెస్ అందుకోవాలి అని పూరి జగన్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే. మరోవైపు తేజ సజ్జ మిరాయ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tags:    

Similar News