పూరీ బెగ్గర్ లో స్టార్ క్యామియో..?
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా విజయ్ సేతుపతితో చేస్తున్నాడన్న విషయం తెలిసిందే.;
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా విజయ్ సేతుపతితో చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. బెగ్గర్ టైటిల్ తో ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారు. విజయ్ సేతుపతి సినిమా చేయాలంటే కంటెంట్ కొత్తగా ఉండాలి. అందులోనూ కమర్షియల్ సినిమాల కన్నా మీడియం బడ్జెట్ లో మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తుంటాడు విజయ్ సేతుపతి. ఐతే పూరీతో విజయ్ చేసే సినిమా ఎలా ఉంటుంది అన్నది సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
పూరీ జగన్నాథ్ బెగ్గర్ సినిమా గురించి విజయ్ సేతుపతి మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఆ సినిమా గురించి తనని ఏమి అడగొద్దు అంటూ చెప్పేశాడు విజయ్. బెగ్గర్ ని అంత సీక్రెట్ గా ఉంచడానికి రీజన్స్ ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆడియన్స్. ఇదిలా ఉంటే పూరీ విజయ్ కాంబోలో వస్తున్న బెగ్గర్ సినిమాలో ఒక తెలుగు స్టార్ క్యామియో ఉంటుందని అంటున్నారు. పూరీ అడగాలే కానీ క్యామియో రోల్ కి కాదని చెప్పే ఛాన్స్ లేదు.
ఇంతకీ విజయ్ సేతుపతి బెగ్గర్ లో నటించే తెలుగు హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బెగ్గర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు కూడా నటిస్తుంది. పూరీ జగన్నాథ్ ఈసారి బెగ్గర్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీకి మరో హీరో ఛాన్స్ ఇస్తారా అన్నట్టుగా డిస్కషన్స్ జరిగాయి. కానీ పూరీ కథ చెప్పగానే విజయ్ సేతుపతి ఓకే చెప్పాడు.
ఈ కాంబినేషన్ అసలు ఎవరు ఊహించలేదు కానీ విజయ్ సేతుపతికి పూరీ చెప్పిన స్టోరీ నచ్చబట్టే ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. విజయ్ లేటెస్ట్ గా ఏస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ సినిమాలే చేసినా వాటి డబ్బింగ్ రిలీజ్ లతో విజయ్ సేతుపతి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంటున్నాడు. అంతేకాదు ఉప్పెనలో శేషారాయణం పాత్రలో ఆయన యాక్టింగ్ తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. అందుకే విజయ్ సేతుపతి ఇంకా తెలుగు సినిమాలు చేయాలని వారు ఆశిస్తున్నారు. విజయ్ సేతుపతి బెగ్గర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా సినిమాను 3 నెలల్లో పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నారట పూరీ జగన్నాథ్. మరి ఈ సినిమాతో ఆయన కంబ్యాక్ ఇస్తారా లేదా అన్నది చూడాలి.