పూరీ బెగ్గర్.. ఆ రోజులు గుర్తు చేస్తాడా..?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనే ట్యాగ్ లైన్ కి సరిపోయేలా తన సినిమాలతో హిట్లు సూపర్ హిట్లు కొట్టాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.;
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనే ట్యాగ్ లైన్ కి సరిపోయేలా తన సినిమాలతో హిట్లు సూపర్ హిట్లు కొట్టాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఆయన ఇప్పుడు వరుస డిజాస్టర్ సినిమాలు అందిస్తున్నాడు. పూరీ సినిమా అంటే ఒకప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్, అంచనాలు లేవు. ఈ డౌన్ ఫాల్ పూరీ ఊహించాడా లేదా అన్నది తెలియదు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయలేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్స్ గా ఉన్న ప్రతి ఒక్కరికి పూరీ హిట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
పూరీతో సినిమా చేస్తే కెరీర్ బెస్ట్ హిట్ అందుకోవడం పక్కా అన్న దగ్గర నుంచి పూరీతో సినిమా అంటే సైడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా పూరీ తన ప్రయత్నాలు చేస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరీ కి ఎవరు ఛాన్స్ ఇస్తారా అని ఎదురుచూడగా నేనున్నా అంటూ వచ్చాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.
కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే విజయ్ సేతుపతితో బెగ్గర్ అంటూ రాబోతున్న పూరీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రాబోతున్నాడని తెలుస్తుంది. మరోసారి ఆడియన్స్ కి పాత పూరీని గుర్తు చేసేలా తన రైటింగ్ ఉంటుందని టాక్. ఆ కసి నచ్చే విజయ్ సేతుపతి కూడా ఛాన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. విజయ్ సేతుపతి ఒక కథ ఓకే చేశాడంటే తప్పకుండా అందులో కచ్చితంగా మ్యాటర్ ఉంటుంది.
మరి ఈ బెగ్గర్ ఎలా ఉంటాడు. ఎలాంటి హంగామా సృష్టిస్తాడు అన్నది చూడాలి. ఒకవేళ మళ్లీ పోకిరి, బద్రి, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి లాంటి పూరీ కంబ్యాక్ ఇస్తే మాత్రం పూరీ ఫ్యాన్స్ కే కాదు తెలుగు ఆడియన్స్ కి పండగ అన్నట్టే లెక్క. పూరీ కమిటై చేసే సినిమాలు రికార్డులు సృష్టించాయి. మరి పూరీ ఈ బెగ్గర్ కోసం ఒకప్పటి తనని తాను గుర్తు చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి. తప్పకుండా పూరీ మార్క్ సినిమా వస్తే మాత్రం లెక్కలన్నీ మారే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి విజయ్ పూరీ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారన్నది చూడాలి.