'గోవా గుట్టు విప్పిన పూరి
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. కొంతకాలంగా వివిధ అంశాలపై పూరి మ్యూజింగ్స్ పేరుతో మాట్లాడుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. కొంతకాలంగా వివిధ అంశాలపై పూరి మ్యూజింగ్స్ పేరుతో మాట్లాడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా సరికొత్త అంశాలు ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన మ్యూజింగ్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా పోర్చుగీస్ జీవన విధానం కోసం ఆయన మాట్లాడారు.
జీవితంలో ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉండే లైఫ్‌స్టైల్ పోర్చుగీస్ వారి నుంచి మనకు వచ్చిందని పూరీ అన్నారు. హాయిగా, మనశ్శాంతిగా, సంతృప్తిగా ఉండే ఆ జీవన విధానాన్ని సూసేగాడ్ అంటారని చెప్పారు. 1498లో కేరళలోని కాలికట్ కు వాస్కోడిగామా చేరుకున్నారని తెలిపారు. అలా భారత్, యూరప్ మధ్య సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పారు.
అయితే పోర్చుగీస్ వాళ్లు గోవాను జయించి తమ మెయిన్ సెంటర్ గా మార్చుకున్నారని, ఆ తర్వాత డయ్యూ డామన్, కోచి, ముంబై వంటి ప్లేస్ లను ఆధనంలోకి తీసుకున్నారని చెప్పారు. ఇండియాలో క్రైస్తవాన్ని విస్తృతం చేసింది వాళ్లేనని, గోవాలో పెద్ద చర్చలు నిర్మించారని చెప్పారు. అలా అక్కడ క్రైస్తవం పెరిగిందని చెప్పారు.
"అలా పోర్చుగీస్ లాంగ్వేజ్, స్థానిక కొంకిణితో మిక్స్ అయింది. వెనిగర్, టొమాటో, బంగాళాదుంప, పచ్చిమిర్చి మనకు వాళ్లే ఇంట్రడ్యూస్ చేశారు. గోవన్ చేపల కూర వాళ్లదే. అంతే కాదు. పోర్చుగీసు వాళ్లు గోవా వాళ్లను పెళ్లి చేసుకోవడం వల్ల ఇండో-పోర్చుగీస్ సొసైటీ ఏర్పడింది. అందుకే అక్కడ కార్నివాల్స్ అవుతాయి" అని చెప్పారు..
"అయితే పోర్చుగీస్ వాళ్లు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత లోకల్‌గా ఉన్న కొంకిణి మ్యూజిక్‌తో కలిసి ఒక స్పెషల్ మ్యూజిక్ ఏర్పడింది. పోర్చుగల్ ఫ్యాడో అని అంటారు. అలా అక్కడి మ్యూజిక్ తో కలిసి మాండో అనే డ్యాన్స్ స్టార్ట్ అయింది. వాళ్లు వేసుకునే క్లోత్స్ చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి" అని తెలిపారు.
"పోర్చుగీస్ వాళ్లు మసాలా దినుసులతో బిజినెస్ చేసేవారు. మిరియాలు, దాల్చిన చెక్క వంటి ఇంపోర్ట్ చేసుకునేవారు. అయితే వ్యాపారాల విషయంలో బ్రిటిష్, డచ్చితో గొడవలయ్యాయి. అలా అప్పుడు స్ట్రాంగ్ నేవిగేషన్ క్రియేట్ చేశారు. పోర్చుగీస్ వారి వల్ల ప్రజలకు సరికొత్త సూసేగాడ్ లైఫ్ స్టైల్ అలవాటైంది" అని చెప్పారు.
"అందుకే గోవా వాళ్ళు స్పెషల్ గా ఉంటారు. అందుకే మనం గోవా వెళ్లినప్పుడు వాళ్లలాగానే ఉంటాం. సెల్ ఫోన్స్ వాడటం ఇష్టం ఉండదు. సూసేగాడ్ దెబ్బ తింటుందని కనీసం టవర్స్ కూడా పెట్టనివ్వరు. అందుకే గోవాలో సిగ్నల్స్ రావ్. ఆ తర్వాత భారత సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టి, గోవా, డయ్యూ డామన్ దేశంలో విలీనం చేసుకుంది. కానీ ఇప్పటికీ ఇండియన్స్ కు వాళ్ల కల్చర్ అంటే ఇష్టం. అందుకే మనం గోవా వెళ్తాం" అని అన్నారు.