పూరి సర్ కల ఫలించేది ఎప్పుడు?
అయితే చిరంజీవితో సినిమా తీయాలి! అనుకోవడానికి కారణం... పూరి కూడా అందరిలాగే మెగాస్టార్ కి వీరాభిమాని. తన స్కూల్ డేస్ లో చిరంజీవి ఫోటోగ్రాఫ్ ని ఆర్ట్ వేసాడు పూరి.;
సినిమాలు తీసినా తీయకపోయినా, సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి ఎలా ఉన్నా.. ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. తన సుదీర్ఘ కెరీర్ లో ట్యాలెంటెడ్ కమర్షియల్ డైరెక్టర్ పూరి పరిశ్రమలోని అందరు అగ్ర హీరోలతో పని చేసారు.. ఒక్క మెగాస్టార్ చిరంజీవితో తప్ప. మెగా హీరోల్లో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వంటి హీరోలతో సినిమాలు తీసాడు పూరి. కానీ చిరంజీవితో సినిమా తీయలేకపోయాడు.
పలుమార్లు చిరుతో సినిమా తీయాలని ప్రయత్నించినా కానీ విఫలమయ్యాడు. అప్పట్లో చిరంజీవి రాజకీయాలు విరమించి ఖైదీ నంబర్ 150 చిత్రంతో పరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చినప్పుడు `ఆటో జానీ` కథను వినిపించాడు పూరి. కానీ స్క్రిప్టు సంపూర్ణంగా లేకపోవడంతో చిరు ఓకే చెప్పలేదు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినా ఎలాగైనా చిరును ఒక సినిమాకి కమిట్ చేయించాలని పూరి చేయని ప్రయత్నం లేదు. అయినా కుదరలేదు...
అయితే చిరంజీవితో సినిమా తీయాలి! అనుకోవడానికి కారణం... పూరి కూడా అందరిలాగే మెగాస్టార్ కి వీరాభిమాని. తన స్కూల్ డేస్ లో చిరంజీవి ఫోటోగ్రాఫ్ ని ఆర్ట్ వేసాడు పూరి. నాటి ఫోటోగ్రాఫ్ ఇప్పటికీ పూరి వద్ద పదిలంగానే ఉంది. పాత డైరీని తిరగేసినప్పుడు చిరంజీవి ఫోటో గీసినది బయటపడిందట. దానిని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసి పూరి తన ఫేవరెట్ హీరో చిరంజీవి గురించి ఎమోషనల్ గా స్పందించారు. `ఖైది` విడుదలైనప్పుడు థియేటర్ కి వెళ్లి అక్కడ లాంజ్ లోని డిస్ ప్లే గ్లాసెస్‌లో చిరంజీవి డ్రాయింగ్ ఫోటోని ఉంచారట. 60/40 ఫోటోగ్రాఫ్ ని ఇప్పటికీ పదిలంగా దాచి ఉంచిన పూరి దానిని ఇన్ స్టాలో ప్రదర్శనకు పెట్టారు. ఆ రోజు థియేటర్ లోని గ్లాసెస్ లో ఈ ఫోటోని ఉంచిన ఆ అభిమాని పేరు పూరి జగన్నాథ్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. అదే సమయంలో చిరంజీవి- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇటీవలే `మన శంకర వరప్రసాద్ గారు` సెట్స్ లో పూరి నేరుగా చిరును కలిసి ఆశీర్వాదం అందుకున్నారు గనుక ఇకపై అయినా ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందనే భావిద్దాం.