నా మాటలు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి : శిరీష్ రెడ్డి

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల్లో ముందుండి నడిపించేది దిల్ రాజే అయినా ఆయన వెనక ఉండి ఆ బాధ్యతలను మోస్తుంటాడు శిరీష్ రెడ్డి.;

Update: 2025-07-01 16:55 GMT

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల్లో ముందుండి నడిపించేది దిల్ రాజే అయినా ఆయన వెనక ఉండి ఆ బాధ్యతలను మోస్తుంటాడు శిరీష్ రెడ్డి. అందుకే సినిమా నిర్మాతగా రాజు, శిరీష్ ఇద్దరి పేర్లు పడతాయి. దిల్ రాజు మాత్రమే ముందు ఉండి శిరీష్ వెనక ఉండి ఇన్నాళ్లు నిర్మాణ సంస్థని నడిపించారు. ఐతే ఈమధ్య శిరీష్ కూడా బయటకు వస్తున్నారు. నిర్మాతగా తన ఇన్వాల్వ్ మెంట్ కూడా చూపిస్తునారు. ఇదివరకు ఈవెంట్స్ లో కనిపించడం కూడా జరగని శిరీష్ ఈమధ్య సినిమా ఈవెంట్స్ లో స్పీచ్ లు కూడా ఇస్తున్నారు.

ఐతే శిరీష్ లేటెస్ట్ గా తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాపైతే డైరెక్టర్, హీరో ఎవరు తమతో మాట్లాడలేదని అన్నారు. ఐతే ఈ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. శిరీష్ మీద ఎస్.వి.సి బ్యానర్ మీద మెగా ఫ్యాన్స్ ఎటాకింగ్ కి దిగారు. ఐతే ఈ విషయంపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. జరిగిన ఆరు నెలల్లో చాలా సినిమాలు రిలీజై ఫ్లాప్ అయ్యాయి. ఒక్క గేమ్ ఛేంజర్ నే ఎందుకు అడుగుతున్నారంటూ మాట్లాడారు.

ఇక విషయం పెద్దది అవకుండా నిర్మాత శిరీష్ రెడ్డి ఒక నోట్ రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం.. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు.. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్ధాలకు దారి తీసి.. దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి అని రాసుకొచ్చారు.

తమ్ముడు సినిమా రిలీజ్ టైం లో ఇలా శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టాయి. ఐతే దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇవ్వగా లేటెస్ట్ గా శిరీష్ కూడా ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. మరి ఈ విషయం ఇక్కడితో వదిలేస్తారా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News