స్టార్ హీరోయిన్‌ నెక్లెస్ ధ‌ర తెలిస్తే మైండ్ బ్లో

ఇటీవ‌ల అంబానీల ఈవెంట్ కోసం ముంబైలో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, బాలీవుడ్ లో సొంత బ్యాన‌ర్ సినిమాల‌పైనా దృష్టి సారించింది.

Update: 2024-05-23 14:18 GMT

గ్లోబ‌ల్ స్టార్‌గా పాపుల‌రైంది ప్రియాంక చోప్రా. అమెరిక‌న్ గాయ‌కుడు నిక్ జోనాస్‌ని పెళ్లాడాక అమెరికాలోనే నివాసం ఉంటోంది. ముంబైలో వ్య‌వ‌హారాల్ని చ‌క్క‌బెడుతూనే అమెరికాను హాలీవుడ్ ని విడిచిపెట్ట‌డం లేదు. ఇటీవ‌ల అంబానీల ఈవెంట్ కోసం ముంబైలో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, బాలీవుడ్ లో సొంత బ్యాన‌ర్ సినిమాల‌పైనా దృష్టి సారించింది.


మ‌రోవైపు ప్రియాంక చోప్రా వ‌రుస ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. తాజాగా పీసీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోషూట్ లో పీసీ మ‌తి చెడేలా అందాల‌ను ఆర‌బోసింది. డార్క్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోటోషూట్ ఇది. నేప‌థ్యానికి త‌గ్గ‌ట్టుగానే పూర్తిగా బ్లాక్ షిమ్మ‌రీ ఫ్రాక్ ని ధ‌రించిన పీసీ ఎద అందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఈ సొగ‌సును మించి అంద‌రి క‌ళ్లు వేరొక వ‌స్తువుపైకి వెళుతున్నాయి. అది ప్రియాంక చోప్రా ధ‌రించిన ఖ‌రీదైన డైమండ్ నెక్లెస్.


ఈ వ‌జ్రాల హారం ధర రూ. 358 కోట్లు అని తెలిస్తే ఎవ‌రైనా షాక్ కి గుర‌వ్వ‌కుండా ఉండ‌గ‌ల‌రా? ఇది పాపుల‌ర్ బ్రాండ్ కి చెందిన నెక్లెస్ అని తెలిసింది. బల్గారి బ్రాండ్ 140వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా ఇటీవల అద్భుతంగా కనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక విషయం పీసీ ధ‌రించిన‌ అద్భుతమైన నెక్లెస్. ఆ ఆభ‌ర‌ణం ధర రూ. 358 కోట్లు. ఈ నెక్లెస్‌లో 140 వజ్రాలు ఉన్నాయి. అంటే బ్రాండ్ ఎన్నో వార్షికోత్స‌వంలోకి వెళితే అన్ని వ‌జ్రాల‌తో ఈ నెక్లెస్ ని డిజైన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ నెక్లెస్ బల్గారి అంత‌ర్జాతీయ బ్రాండ్ కి చెందిన‌ అత్యంత విలువైన సర్పెంటి నెక్లెస్‌లలో ఒకటి. ఈ కళాఖండాన్ని సిద్ధం చేయడానికి స్పష్టంగా 2800 గంటలు పట్టింది.

Read more!

కెరీర్ ప‌రంగా చూస్తే.. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోను పాపుల‌రైంది. బాలీవుడ్ , హాలీవుడ్ లో త‌న‌కు తెరుచుకునే అనేక తలుపులు ఉన్నాయని చెప్పడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది మహిళలకు ప్రియాంక చోప్రా మ‌నో ధైర్యాన్ని ఇవ్వ‌గ‌లిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో పీసీ న‌టించిన‌ షో సిటాడెల్ గత సంవత్సరం చాలా ఎక్కువ‌గా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దాని భారతీయ వెర్ష‌న్ త్వరలో OTT లో ప్రసారం కానుంది. స‌మంత‌, వ‌రుణ్ ధావ‌న్ న‌టించ‌గా దీనిని రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించారు.

Tags:    

Similar News