సోదరి మన్నారాకు కష్టం..ఓదార్చిన ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా - మన్నారా చోప్రా వరుసకు కజిన్స్ అనే విషయం తెలిసిందే. మన్నారా టాలీవుడ్ లో కథానాయికగా కొనసాగుతోంది.;
ప్రియాంక చోప్రా - మన్నారా చోప్రా వరుసకు కజిన్స్ అనే విషయం తెలిసిందే. మన్నారా టాలీవుడ్ లో కథానాయికగా కొనసాగుతోంది. అయితే తన ఎదుగుదలకు ప్రియాంక చోప్రా నుంచి సహకారాన్ని మన్నారా ఆశించదు. ఇక మన్నారా తన సోదరితో సత్సంబంధాలను కలిగి ఉంది. ఇటీవలే మన్నారా తన తండ్రి, ప్రముఖ లాయర్ రామన్ రాయ్ ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈరోజు ప్రియాంక చోప్రా, ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తమ పిన తండ్రి అయిన రామన్ రాయ్ హండా మృతికి సంతాపం తెలిపారు. తమ ఇన్‌స్టాలో సందేశాన్ని షేర్ చేసారు. ఫుఫాజీ (మామ)కి నివాళులు అర్పించారు. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి, రామన్ అంకుల్ (ఫుఫాజీ).. ఓం శాంతి అని రాసారు.
మన్నారా తండ్రి, న్యాయవాది రామన్ రాయ్ హండా(71) సోమవారం ముంబైలో మరణించారు. తన తండ్రి మరణం గురించి మన్నారా సోషల్ మీడియాల ద్వారా తెలియజేసింది. జూన్ 18న మధ్యాహ్నం 1 గంటలకు ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని అంబోలిలోని శ్మశానవాటిక మైదానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. రామన్ రాయ్ హండా ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయనకు భార్య కామిని, కుమార్తెలు మన్నారా, మితాలి ఉన్నారు. రామన్ కొన్ని రోజులుగా అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారు.
`జిడ్` సినిమాతో మన్నారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అటుపై దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. సల్మాన్ ఖాన్ రియాలిటీ షో `బిగ్ బాస్ 17`, లాఫ్టర్ చెఫ్స్ - అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీజన్ 2 లలో కూడా కనిపించింది.