PCకి తెలుగు నేర్పిస్తున్న రాజమౌళి సారు
అయితే ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందే ప్రియాంక చోప్రా `ఆస్క్ మీ ఎనీథింగ్` సెషన్‌లో నెటిజనులతో కొన్ని ఆసక్తికర విషయాలను ముచ్చటించింది.;
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఎస్ఎస్ఎంబి 29` గురించి ఒక్కో అప్ డేట్ వెబ్ లో హీట్ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15 సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి గ్రాండ్ టీజర్ లాంచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. జియో హాట్ స్టార్ ఈ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన హక్కులను ఛేజిక్కించుకుంది.
ఈ భారీ కార్యక్రమానికి సుమారు 50,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆసక్తికరంగా శ్రుతి హాసన్, రాపర్ డివైన్ సినిమా టైటిల్ ట్రాక్ ని పాడతారు. ఈ వేదిక వద్ద రికార్డు స్థాయిలో 130 అడుగుల × 100 అడుగుల స్క్రీన్‌పై టీజర్ ని లాంచ్ చేస్తారని తెలిసింది. ఈ టీజర్ లో మసాయి మారాలో చిత్రీకరించిన ఇంట్రో సీన్ ని ప్రదర్శిస్తారు. ఈ సీన్ మహేష్ బాబు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. సాయంత్రం రామోజీ రావు స్కైలైన్ గ్రాండ్ బాణసంచాతో వెలుగులను పరుచుకోనుంది. నేను తెలుగు కథలు చెబుతాను.. అంచనాలకు అనుగుణంగా జీవిస్తాను.. అని చెప్పింది.
అయితే ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందే ప్రియాంక చోప్రా `ఆస్క్ మీ ఎనీథింగ్` సెషన్‌లో నెటిజనులతో కొన్ని ఆసక్తికర విషయాలను ముచ్చటించింది. ముఖ్యంగా రాజమౌళి సర్ సహకారంతో తాను తెలుగు భాషను స్పష్ఠంగా పలుకుతున్నానని ఆనందం వ్యక్తం చేసింది. తెలుగు తన మాతృభాష కాకపోయినా.. తన లైన్స్ తానే చెప్పుకుంటున్నానని వెల్లడించింది పీసీ. ఇక మరో మూడు రోజుల్లో జరగనున్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గురించి ప్రశ్నించిన అభిమాని చాలా ఎగ్జయిట్ అవుతున్నానని పేర్కొనగా.. ఎంతగా? అని ప్రశ్నించింది పీసీ. మొత్తానికి గ్లోబల్ ఐకన్ గా మనసులు గెలుచుకున్న ప్రియాంక చోప్రా తాజా ప్రశ్నోత్తరాల సెషన్ లో మహేష్ అభిమానులతోను సరదాగా ముచ్చటించింది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అనుమతి లేనిదే సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్ గురించి ఎవరూ బయటకు చెప్పరు. గతంలో రాజమౌళి హీరోలు ప్రభాస్ - రానా, ఎన్టీఆర్- చరణ్ సెట్లో ఉన్న సినిమాల గురించి ఎప్పుడూ నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఎస్.ఎస్.ఎం.బి 29 విషయంలో చిత్ర కథానాయిక, గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా కొన్ని రహస్యాలను బహిర్గతం చేస్తోంది. నిజానికి ఈ లీకులు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
అంతటా హై అలెర్ట్:
దిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనల్లో పాక్ తీవ్రవాదుల ప్రమేయం ఉందని నిరూపణ అయిన తర్వాత ప్రస్తుతం దేశంలో ఏ మూల భారీ ఈవెంట్ జరుగుతున్నా పరిసరాల్లోని పోలీస్ బృందంలో టెన్షన్ వాతావరణం అలుముకుంటోందని తెలుస్తోంది. పబ్లిక్ గేధరింగ్స్ ఉండే చోట భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. ప్రస్తుతం మహేష్- రాజమౌళి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ వద్ద ఎలాంటి అపశ్రుతులు జరగకుండా పోలీసులు గట్టి బంధోబస్తును ఏర్పాటు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.