వీడియో : బీచ్‌లో నిక్-పీసీ లిప్ లాక్ ముద్దు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కి వలస వెళ్లి అక్కడ వరుస సినిమాలు, సిరీస్‌ల్లో నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది.;
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కి వలస వెళ్లి అక్కడ వరుస సినిమాలు, సిరీస్‌ల్లో నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. గ్లోబల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయి అమెరికన్ గాయకుడు. ఇతడు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో షో లు చేశాడు. ప్రియాంక చోప్రా, నిక్ ల వివాహం 2018లో జరిగింది. నిక్ కంటే ప్రియాంక చోప్రా 10 ఏళ్లు వయసులో పెద్ద. దాంతో వీరిద్దరి బంధం మూడు నాళ్ల ముచ్చటే అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. అమెరికన్ కార్డ్ కోసం అని కొందరు డబ్బు కోసం అని మరికొందరు ప్రియాంక చోప్రా కావాలని నిక్ ను పెళ్లి చేసుకుందని విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు.
నిక్ జోనస్ సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా ప్రియాంక చోప్రాతో ఉన్న ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా బీచ్‌లో ప్రియాంక చోప్రాతో ఉన్న ఒక వీడియోను షేర్ చేశాడు. ఆమె లేకుండా.. అంటూ ఒక ఈమోజీని షేర్ చేసిన నిక్ బీచ్‌లో ఆమె పరిగెత్తుకుంటూ రాగా, పైకి ఎత్తుకుని లిప్‌లాక్ చేసిన వీడియోను షేర్ చేశాడు. ప్రియాంక కంటే పదేళ్లు చిన్నా అన్నారు, అతడితో పీసీ కచ్చితంగా ఎక్కువ కాలం ఉండదని అన్నారు. వీరి వివాహం జరిగి అప్పుడే ఏడు ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు వీరిద్దరి గురించి ఎలాంటి పుకారు కూడా రాలేదు. వీరిద్దరూ ఎప్పటికప్పుడు సంతోషంగా కనిపిస్తూ ఉండటంతో పుకారు వచ్చేందుకు కూడా ఆస్కారం లేకుండా చేస్తున్నారు.
బీచ్ లో ప్రియాంక చోప్రా దిగిన ఫోటోలను షేర్ చేసింది. కానీ ఇలా నిక్ తో ఉన్న బీచ్ వీడియోను మాత్రం షేర్ చేయలేదు. 35 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న నిక్ జోనస్ ఏ ఫోటో లేదా వీడియో షేర్ చేసినా నిమిషాల్లో లక్షల మంది చూడటంతో పాటు, లక్షల మంది లైక్స్, షేర్స్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోకు కూడా అదే స్థాయి రెస్పాన్స్ దక్కింది. ఈ వీడియోను అంతకు మించి అన్నట్లుగా లైక్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. మొత్తానికి నిక్ జోనస్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట షేక్ చేస్తుంది. ప్రియాంక చోప్రాకు ఉన్న గ్లోబల్ స్టార్ ఇమేజ్ కారణంగా ఈ వీడియోకు మరింత రీచ్ దక్కిందని కొందరు అంటున్నారు. ప్రియాంక చోప్రా చాలా రోజుల తర్వాత ఇండియన్ మూవీస్‌కి ఓకే చెప్పింది.
హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిగా ఎంపిక అయింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌లోనూ ప్రియాంక చోప్రా పాల్గొంది. మరో వైపు బాలీవుడ్‌లోనూ ప్రియాంక చోప్రా ఒక సినిమాను చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో మరోసారి ప్రియాంక చోప్రా ఇండియాకు రాజమౌళి-మహేష్ బాబు మూవీ షూటింగ్ కోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే బాలీవుడ్ మూవీని సైతం మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈమె హాలీవుడ్‌లో సూపర్ హిట్ వెబ్ సిరీస్‌కి కొత్త సీజన్ చేసేందుకు రెడీ అవుతోంది.