కొండ చిలువను ఆభరణంలా ధరించి పీసీ గట్స్
అంత పెద్ద కొండ చిలువను మెడలో ఆభరణంలా ధరించి హాయిగా నవ్వులు చిందిస్తూ కనిపించింది. అత్యంత భారీగా చూస్తుంటేనే భయపెడుతోంది ఆ కొండచిలువ.;
ప్రియాంక చోప్రా సాహసం చూస్తుంటే కచ్ఛితంగా `డేరింగ్ క్వీన్` అని పొగిడేయకుండా ఉండలేరు. అంత పెద్ద కొండ చిలువను మెడలో ఆభరణంలా ధరించి హాయిగా నవ్వులు చిందిస్తూ కనిపించింది. అత్యంత భారీగా చూస్తుంటేనే భయపెడుతోంది ఆ కొండచిలువ. కానీ ప్రియాంక చోప్రా తన పెంపుడు పెట్ పైథాన్ తో వ్యవహరించినట్టు, సరదాగా దానితో ఆటలాడుకుంటోంది. నిక్ జోనాస్ కి పరిచయం చేస్తూ అతడిని కూడా ఆట పట్టించేస్తోంది. అంత పెద్ద మొగోడు నిక్ ఈ భారీ సరీసృపాన్ని చూసి భయపడిపోతున్నాడు.
ఇక పబ్లిక్ లో ఈ భార్యా భర్తలిద్దరూ ఓ చోట చేరితే ఉండే రచ్చ అంతా ఇంతా కాదని మరోసారి నిరూపణ అయింది. ఆ ఇద్దరి మధ్యా ఫన్, హాస్యం, కెమిస్ట్రీ ఎప్పటిలానే అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రియాంక చోప్రా కొండ చిలువలతో ఆడుకోవడం ఇదే మొదటిసారి కాదు.. వాటితో తన చెలిమికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. అలాగే భారీ కొండ చిలువను మెడలో వేసుకుని చిద్విలాసంగా నవ్వులు చిందిస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. తన భర్త, గాయకుడు నిక్ జోనాస్ ``కొత్త ఆభరణాలను ప్రేమిస్తున్నాను బేబ్!`` అని వ్యాఖ్యానించగా, దానికి ప్రియాంక ``ధన్యవాదాలు.. ఇది సర్పెంటైన్`` అని సమాధానం ఇచ్చారు. భార్యా భర్తల మధ్య ఛమత్కారం, సరసం కూడా ఆకట్టుకుంటున్నాయి.
ఇలా మెడలో కొండ చిలువను ధరించడం ఇప్పుడే మొదటిసారి కాదు. పీసీ గతంలోను ఇలాంటి సాహసాలతో అలరించింది. అందుకు సంబందించిన త్రోబ్యాక్ స్నాప్‌షాట్‌లను కూడా చూపించింది. ఓ సందర్భంలో మెడలో పసుపు రంగు కొండచిలువను ధరించిన ఫోటోగ్రాఫ్, అలాగే నల్లటి భారీ పామును పట్టుకున్న ఫోటోగ్రాప్ కూడా ఈ ఆల్బమ్ లో కనిపించాయి. పీసీ చాలా ధైర్యంగా నాగుపామును కూడా పట్టుకుని కనిపించింది. ఇలా పాములతో పీసీ సావాసం చేస్తూ, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న తీరుకు నెటిజనుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ సరసన భారీ యాక్షన్-అడ్వెంచర్ లో నటిస్తోంది. ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీ తరహాలో నవ్య పంథా కథనంతో ఫారెస్ట్ అడ్వెంచర్ ఆకట్టుకుంటుందని దర్శకుడు రాజమౌళి చెబుతున్నారు. ఈ చిత్రం 2027 లో విడుదల కానుంది. `జడ్జిమెంట్ డే` అనే కామెడీ చిత్రంలోను పీసీ నటిస్తోంది. ఇందులో జాక్ ఎఫ్రాన్, విల్ ఫెర్రెల్ ,రెజీనా హాల్ నటీనటులు. `ది బ్లఫ్` అనే యాక్షన్ చిత్రంలో 19వ శతాబ్దపు మాజీ పైరేట్ గాను నటిస్తోంది.