క్రిస్మస్ పాటను ఖూనీ చేసిందంటూ పీసీపై ఫైర్
కొన్ని నెలలుగా రాజమౌళితో మూవీ కోసం కఠినంగా శ్రమిస్తున్న ప్రియాంక చోప్రా, ఇప్పుడు ఓ పాట కోసం గాయకురాలి అవతారం ఎత్తింది.;
గ్లోబల్ ఐకన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా, యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గాను కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పీసీ కొన్నేళ్లుగా ఆంగ్ల వెబ్ సిరీస్ లలో నటిస్తూ, హాలీవుడ్ చిత్రాలతోను బిజీగా గడిపారు. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంఎస్ఎంబి 29లో నటిస్తోంది. మహేష్ ఈ చిత్రంలో కథానాయకుడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది.
కొన్ని నెలలుగా రాజమౌళితో మూవీ కోసం కఠినంగా శ్రమిస్తున్న ప్రియాంక చోప్రా, ఇప్పుడు ఓ పాట కోసం గాయకురాలి అవతారం ఎత్తింది. దాదాపు 10 నెలల క్రితం విడుదలై అంతర్జాలాన్ని ఒక ఊపు ఊపిన ప్రఖ్యాత వామ్ రాసిన `లాస్ట్ క్రిస్మస్` పాటకు పీసీ తన గాత్రాన్ని అందించారు. లాస్ట్ క్రిస్మస్ దేశీ వెర్షన్ ని ప్రియాంక చోప్రా ఆలపించారు. అయితే పీసీ తీవ్రమైన ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు కామెంట్ చేస్తూ, ఇప్పటివరకు అత్యంత పాపులర్ క్రిస్మస్ పాటలలో ఒకదాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. మరికొందరు ట్రాక్ అతిగా ఆటో-ట్యూన్ చేయడంతో ప్రియాంక చోప్రా స్వరం వాస్తవంగా వినిపించడం లేదని విమర్శించారు.
అయితే ప్రియాంక చోప్రా దీనిని అంత తేలిగ్గా తీసుకోలేదు. ట్రోలర్స్ కు తనదైన శైలిలో కౌంటర్ వేసింది. శనివారం నాడు ఇన్ స్టాలో ఒక క్రిప్టిక్ పోస్ట్ ని పీసీ షేర్ చేసింది. ``చాలా మంది నన్ను వారిలాగా ఉండటానికి ప్రేరేపించారు!`` అని కౌంటర్ మెసేజ్ ని పోస్ట్ చేసింది. అయితే ఇది ట్రోలర్లకు చెక్ పెట్టేందుకు పీసీ మెసేజ్ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. `క్రిస్మస్ కర్మ` అంటూ సాగే ఈ పాటను తన స్నేహితురాలు గురీందర్ చద్దా కోసం పాడానని కూడా పీసీ వెల్లడించారు. నా స్థాయిలో చిన్నగా ఆమెకు మద్ధతునిచ్చేందుకు పాడానని కూడా పీసీ వివరణ ఇచ్చారు. మనలో చాలా మందికి క్రిస్మస్ సౌండ్‌ట్రాక్‌గా ఉన్న ఈ పాటకు దేశీ ట్విస్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను.. అని పీసీ వ్యాఖ్యానించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ చిత్రం `హెడ్స్ ఆఫ్ స్టేట్` ఈ ఏడాది విడుదలైంది. జాన్ సెనా , ఇద్రిస్ ఎల్బా తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా ప్రియాంక చోప్రా స్టంట్స్, యాక్షన్ కు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం పీసీ పూర్తిగా రాజమౌళి సినిమాపైనే ఫోకస్ చేస్తోంది.