పిక్‌టాక్‌ : బీచ్‌లో ప్రియాంక చోప్రా లుక్‌ వైరల్‌

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ప్రియాంక చోప్రా గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తున్న విషయం తెల్సిందే.;

Update: 2025-08-01 07:20 GMT

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ప్రియాంక చోప్రా గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తున్న విషయం తెల్సిందే. హాలీవుడ్‌ హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా ఆఫర్లు దక్కించుకుంటూ, పారితోషికం అందుకుంటున్న ప్రియాంక చోప్రాను అభిమానులు గ్లోబల్‌ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. పేరుకు తగ్గట్లుగానే ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా మొత్తం గ్లోబ్‌లో ఉన్న దేశాలన్నింటిలోనూ గుర్తింపు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే హాలీవుడ్‌లో ఎన్నో ప్రాజెక్ట్‌లను చేయడం ద్వారా అక్కడ కూడా టాప్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకుంది. కమర్షియల్‌ సినిమాలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు, సిరీస్‌లు చేయడం ద్వారా ప్రియాంక చోప్రా మంచి గుర్తింపు దక్కించుకుంది.


ప్రియాంక చోప్రా 43వ బర్త్‌డే

సాధారణంగా హీరోయిన్స్ మూడు పదుల వయసు దాటితే ఆఫర్లు తగ్గి పోతాయి. కానీ ప్రియాంక చోప్రా 42 ఏళ్ల వయసులోనూ అక్కడ ఇక్కడ ఫుల్‌ బిజీగా ఉంది. ఇటీవల ప్రియాంక చోప్రా తన 43వ పుట్టిన రోజును ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో వైభవంగా జరుపుకుంది. బీచ్‌లో, సముద్రంపైన ప్రియాంక చోప్రా బర్త్‌డే ఫోటోలు, వీడియోలు గత వారం రోజులుగా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. భర్త నిక్‌తో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా వీరిద్దరి బర్త్‌డే స్పెషల్‌ ముద్దు వీడియో ఏ స్థాయిలో రీచ్‌ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిక్‌, ప్రియాంక చోప్రాలకు ఇన్‌స్టాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ స్థాయిలో ఫాలోయింగ్‌ ఉండటం వల్లే బర్త్‌డే ఫోటోలు వైరల్‌ అయ్యాయి.


గ్రీన్‌ కలర్‌ బికినీలో ప్రియాంక చోప్రా

తాజాగా మరోసారి ప్రియాంక చోప్రా బర్త్‌డే కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేసింది. ఈసారి భర్త నిక్‌తో పాటు కూతురు మాల్తీ ఉన్న ఫోటోను పీసీ షేర్‌ చేయడం ద్వారా మరింతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొదటి నుంచి ప్రియాంక చోప్రా తన కూతురు పోటోలను హైడ్‌ చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా మాల్తీ కిందకు చూస్తున్న ఫోటోను మాత్రమే పీసీ షేర్‌ చేయడం ద్వారా అభిమానులను నిరుత్సాహంకు గురి చేసింది. నిక్‌ సింగిల్‌ షార్ట్‌ మీద ఉండగా, ప్రియాంక గ్రీన్‌ కలర్‌ బికినీ ధరించి ఉంది. స్టైలిష్ గాగుల్స్‌ను ధరించడం ద్వారా వీరిద్దరూ కట్టిపడేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, వీరిద్దరి జోడీ భలే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్స్‌కి చేరువ

ప్రియాంక చోప్రా కంటే నిక్‌ వయసులో దాదాపుగా పదేళ్లు చిన్నవాడు అనే విషయం తెల్సిందే. కేవలం అమెరికన్‌ పౌరసత్వం కోసం ప్రియాంక చోప్రా అతడిని వివాహం చేసుకుంది అంటూ విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వీరి అన్యోన్యం చూచి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందమైన ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలోనే లేదు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో మంద మిలియన్‌లకు చేరువలో ఉంది. మరో 7 మిలియన్‌ల మంది ఇన్‌స్టాలో ఈమెను ఫాలో అయితే సెంచరీ కొట్టనుంది. హాలీవుడ్‌ స్టార్స్‌లోనూ అతి కొద్ది మందికి మాత్రమే వంద మిలియన్‌ల ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్నారు. కనుక ప్రియాంక చోప్రా క్రేజ్‌ లో హాలీవుడ్‌ స్టార్స్‌తో పోటీ పడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News