ప్రియదర్శి.. ఎంత స్పీడంటే..

అంటే ప్రస్తుతం ప్రియదర్శి చేతిలోనే హీరోగానే మూడు సినిమాలు ఉన్నాయి.

Update: 2024-05-01 07:30 GMT

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న యువ నటుడు ప్రియదర్శి పులికొండ. పెళ్లి చూపులు సినిమాతో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. జాతిరత్నాలు సినిమా అయితే అతనికి స్టార్ యాక్టర్ ఇమేజ్ ఇచ్చింది. ప్రియదర్శి సినిమాలో ఉన్నాడు అంటే కచ్చితంగా అందులో కామెడీకి కొదవ ఉండదు అనే అభిప్రాయం పబ్లిక్ లో క్రియేట్ చేశాడు.

సేవ్ ది టైగెర్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రియదర్శి అందరిని ఆకట్టుకున్నాడు. బలగం మూవీ ప్రియదర్శికి హీరోగా బ్రేక్ ఇచ్చింది. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బలగం సినిమాలో ప్రియదర్శి తనదైన కామెడీతో అందరిని నవ్విస్తూనే క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించాడు. ఈ మూవీ తర్వాత ప్రియదర్శికి హీరోగా అవకాశాలు పెరుగుతున్నాయి.

ఆ మధ్య కాలంలో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయ్యింది. హనుమాన్ మూవీ నిర్మాతతో నభా నటేష్, ప్రియదర్శి జోడీగా డార్లింగ్ అనే మరో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. అశ్విన్ రామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ రెండు సెట్స్ పైన ఉండగానే ఇప్పుడు రానా దగ్గుబాటి సొంత ప్రొడక్షన్ లో ప్రియదర్శి హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

Read more!

అంటే ప్రస్తుతం ప్రియదర్శి చేతిలోనే హీరోగానే మూడు సినిమాలు ఉన్నాయి. ఓ వైపు స్టార్ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూన్న ప్రియదర్శికి ఈ మూడు సినిమాలు హీరోగా బ్రేక్ ఇచ్చేలాగే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇప్పటికే కమెడియన్ సుహాస్ వరుస హిట్స్ తో హీరోగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ఇదే బాటలో ప్రియదర్శి కూడా హీరోగా మారి కమెడియన్ పాత్రలని వదిలేస్తాడేమో అనేది చూడాలి.

టాలీవుడ్ లోబడ్జెట్ కథలకి ప్రస్తుతం హీరోల కొరత ఉంది. కొత్త దర్శకులు డిఫరెంట్ కథలతో తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయాలని అనుకున్నప్పుడు ఫేమ్ ఉన్న హీరోలు కనిపించడం లేదు. ఇప్పుడు ఆ లోటుని సుహాస్, ప్రియదర్శి లాంటి వారు భర్తీ చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. మరి వీరు హీరోలుగా ఏ మేరకు నిలబడగలుగుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News