లోక సక్సెస్ తలకెక్కించుకోకు..!

మలయాళంలో రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అందుకున్న సినిమా లోక. ఈ సినిమాను తెలుగులో కూడా కొత్త లోకగా రిలీజ్ చేశారు.;

Update: 2025-09-11 07:49 GMT

మలయాళంలో రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అందుకున్న సినిమా లోక. ఈ సినిమాను తెలుగులో కూడా కొత్త లోకగా రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాను డామెరిక్ అరుణ్ డైరెక్ట్ చేశాడు. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో ప్రేమలు నెస్లెన్ కూడా నటించాడు. లోక సినిమా ఇండియన్ స్క్రీన్ పై వచ్చిన ఒక ఫిమేల్ సూపర్ హీరో మూవీ. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలా హంగామా లేదు కానీ వన్స్ రిలీజ్ తర్వాత సినిమా ఒక రేంజ్ లో హంగామా చేస్తుంది.


13 రోజుల్లోనే 200 కోట్లు..

30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 13 రోజుల్లోనే 200 కోట్ల పైన రాబట్టింది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని చూసి చిత్ర యూనిట్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఐతే ఈ టైం లో కళ్యాణి ప్రియదర్శన్ కి ఒక మంచి మెసేజ్ పంపించారు ఆమె తండ్రి దర్శకుడు ప్రియదర్శన్. మలయాళ సినిమాల్లో తన మార్క్ చూపిస్తూ ప్రియదర్శన్ చేసిన సినిమాలు ఎంతో ప్రత్యేక స్థాయి తెచ్చుకున్నాయి. ప్రియదర్శన్ కూతురైన కళ్యాణి హీరోయిన్ అవుతానని అంటే ఎంకరేజ్ చేశారు.

ఐతే లోక తో సక్సెస్ అందుకున్న కూతురికి ఒక దర్శకుడిగానే కాదు ఒక ఫాదర్ గా మెసేజ్ ఇచ్చారు ప్రియదర్శన్. ఇంతకీ ఆయన ఏమని మెసేజ్ చేశారంటే.. ఒక్కటి గుర్తు పెట్టుకో విజయ గర్వాన్ని తలకు ఎక్కించుకోకు.. ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ బాధను మనసులో మోయకు.. నీకు ఇచ్చే మంచి సలహా ఇదే చక్కరే అంటూ రాసుకొచ్చారు. దానికి కళ్యాణి ప్రియదర్శన్ కూడా అవును నాన్నా ఆల్వేస్.. థ్యాంక్ యు అని రెప్లై ఇచ్చింది.

తండ్రి కూతుళ్ల సంభాషణలు..

ఈ స్టార్ తండ్రి కూతుళ్ల సంభాషణలు బయటకు వచ్చాయి. కెరీర్ లో ఇంత గొప్ప విజయాన్ని చూసి కూతురు ఎక్కడ తప్పు చేస్తుందో అని ఒక తండ్రిగా ప్రియదర్శన్ కళ్యాణికి మంచి సలహా ఇచ్చారు. ఐతే ఆయన కూతురు కాబట్టి ఈ సక్సెస్ తో సంతృప్తి చెందుతుందని అనుకోకూడదు. సో కళ్యాణి కెరీర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన లోక చాప్టర్ 1 చంద్ర లాంటి సినిమాలు మరెన్నో చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

తెలుగు ఆడియన్స్ కు కళ్యాణి ప్రియదర్శన్ బాగా తెలుసు. హలోతో ఆమె తెరంగేట్రం చేయగా.. సాయి తేజ్ తో చిత్రలహరి సినిమా తో సక్సెస్ అందుకుంది. కొత్త లోక సక్సెస్ తో కళ్యాణికి తెలుగు నుంచి కూడా మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News