న‌ల్ల చీర‌లో వింక్ గాళ్ క‌ళ్లు చెదిరే ట్రీట్

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌లే విడుదలైన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాలో ఈ మ‌లయాళ బ్యూటీ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.;

Update: 2025-04-26 03:45 GMT

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌లే విడుదలైన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాలో ఈ మ‌లయాళ బ్యూటీ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. అయితే తాజాగా ద‌ళ‌ప‌తి విజయ్ తన నటనను ప్రశంసిస్తున్న ఏఐ వీడియో విడుద‌ల కాగా, ప్రియా ప్రకాష్ వారియర్ దాదాపుగా ఫిదా అయిపోయింది. ఆ వీడియోలో అంతు ద‌రీ లేని ఆనందం క‌న‌బ‌రిచింది ప్రియా. ఇంత‌కీ ఇందులో ఏం ఉంది? అంటే.. గుడ్ బ్యాడ్ అగ్లీలో సిమ్రాన్ కదలికలను రీక్రియేట్ చేసినందుకు ద‌ళ‌ప‌తి విజయ్ ప్రియా ప్ర‌కాష్ ను ప్రశంసిస్తున్న వీడియోను ప్లే చేస్తారు. షాక్‌కు గురైన ప్రియా ఉలిక్కిపడి కన్నీళ్లు పెట్టుకుని, ఆ వీడియోను తన కోసం రీప్లే చేయమని అడిగారు.

అయితే వీడియో ఏఐలో సృష్టించినది అని హోస్ట్ స్పష్టం చేసారు. ``క్షమించండి, ఇది నిజం కాదు.. ఏఐ సృష్టి`` అని చెప్ప‌గానే ప్రియా చాలా నిరాశ చెందింది. దాదాపు క‌న్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇంట‌ర్నె ట్ లో వైర‌ల్ అయింది. ఇదిలా ఉంటే మ‌రోవైపు ప్రియా వారియ‌ర్ వ‌రుస ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో గుబులు రేపుతున్నాయి.

తాజాగా బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ శారీలో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఫోజులివ్వ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ లో మునుప‌టి కంటే ప్రియా ఎంతో అందంగా ముగ్ధ మ‌నోహ‌రంగా క‌నిపిస్తోంది. చీర‌లో ప్రియా కాన్ఫిడెన్స్ త‌న అందాన్ని ప‌దింత‌లు చేసింది. నల్ల చీర‌లో మెడ సొగ‌సును, నాభి అందాల‌ను అందంగా ప్ర‌ద‌ర్శిస్తోంది ఈ బ్యూటీ. ఒరు ఆధార్ ల‌వ్ చిత్రంతో సినీరంగ ప్ర‌వేశం చేసిన ఈ బ్యూటీ చాలా కాలంగా టాలీవుడ్ బాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌లోను త‌న‌వైపు వ‌చ్చిన అవ‌కాశాల్ని ఒడిసిప‌డుతోంది.

Tags:    

Similar News