బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ ఆగిపోయిందా? కారణమేంటి?
నిజానికి 2024లో విడుదలైన మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేమలు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది.
ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సీక్వెల్స్ రావడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఒక సినిమా భారీ విజయాన్ని అందుకుంటే దాని స్టోరీ కంటిన్యూ చేస్తూ మరో పార్ట్ ను తెరకెక్కించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్నిసార్లు కేవలం హైప్ కోసం సీక్వెల్స్ ను ప్రకటించి, తర్వాత వాటిని సెట్స్ పైకి తీసుకెళ్లని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్ లోకి మాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ప్రేమలు 2 చేరింది.
నిజానికి 2024లో విడుదలైన మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేమలు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. కేవలం కేరళలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ ను ఆకట్టుకున్న కథ, నేచరుల్ రోల్స్, ఎంటర్టైనింగ్ స్టోరీ.. చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. హీరో నస్లేన్, హీరోయిన్ మమితా బైజు జోడీకి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
సినిమా ఘనవిజయం సాధించడంతో మేకర్స్ వెంటనే సీక్వెల్ పై ప్రకటన చేశారు. ప్రేమలు 2 పేరుతో పోస్టర్ ను విడుదల చేస్తూ మరో పార్ట్ ఉంటుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రకటించిన తర్వాత చాలా కాలం గడిచినా సినిమా షూటింగ్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ పరిస్థితిపై ఇప్పటికే అనేక డౌట్లు వచ్చాయి.
మాలీవుడ్ లో అప్పట్లో వినిపించిన టాక్ ప్రకారం, సీక్వెల్ కథ విషయంలో దర్శకుడు, హీరో మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయని ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ పార్ట్ రేంజ్ కు తగ్గ కథ సిద్ధం కాకపోవడం కూడా లేట్ అవ్వడానికి కారణమని వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయాలపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు తాజాగా హీరో నస్లేన్ కె. గఫూర్ క్లారిటీ ఇచ్చారు.
ప్రేమలు 2 ప్రస్తుతం నిలిచిపోయిందని వెల్లడించారు. స్క్రిప్ట్ వర్క్ స్టేజ్ లోనే ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పారు. ప్రస్తుతానికి సీక్వెల్ ను ముందుకు తీసుకెళ్లే ఆలోచన లేదని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ ను రద్దు చేశారంటూ అనేక మంది సినీ ప్రియులు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. సీక్వెల్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశామని అంటున్నారు.
మరికొందరు మాత్రం స్టోరీ సరిగ్గా లేకపోవడంతో ప్రాజెక్టును పక్కన పెట్టడమే మంచిదని అంటున్నారు. లేకుంటే సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రేమలు 2 ఆగిపోయినట్లే కనిపిస్తోంది. ఫ్యూచర్ లో సరైన కథ సిద్ధమైతే ఆ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి సినీ ప్రియులు మాత్రం ఆ సూపర్ హిట్ లవ్ స్టోరీ సీక్వెల్ ను చూడాలనే ఆశను కొంతకాలం పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.