లెక్కల జీన్స్ నుండి నటన వైపు.. మేధావుల వారసత్వంలో సరికొత్త ఆర్ట్!

బ్లాస్ట్' సినిమాతో కుర్రకారును ఆకట్టుకున్న హీరోయిన్ ప్రీతీ ముకుందన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

Update: 2026-07-19 02:30 GMT

బ్లాస్ట్' సినిమాతో కుర్రకారును ఆకట్టుకున్న హీరోయిన్ ప్రీతీ ముకుందన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. దేశం గర్వించదగ్గ గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ కుటుంబానికి ఆమె బంధువనే విషయం బయటకు వచ్చింది. ప్రీతి ముత్తాత, రామానుజన్ సోదరుడని తెలుస్తోంది. అయితే ఈ వార్త కేవలం ఒక సినిమా అప్‌డేట్ లాంటిది కాదు, మానవ మేధస్సు ఒక తరం నుండి మరో తరానికి ప్రవహించేటప్పుడు అది ఎలా మారుతుందో..తెలుసుకుందాం ..

లెక్కల రూల్స్ లేవు - కళకు సరిహద్దుల్లేవు:

సాధారణంగా మేధావుల కుటుంబంలో పుట్టిన పిల్లలు కచ్చితంగా సైన్స్, మ్యాథ్స్ లేదా పెద్ద పెద్ద అకడమిక్స్ వైపే వెళ్లాలనే రూల్ ఏమీ లేదు. ఒక తరం గణితంలో అద్భుతాలు సృష్టిస్తే, మరో తరం కళా రంగంలో రాణించవచ్చు. మానవ మేధస్సు అనేది కేవలం పుస్తకాలు, సమీకరణాలకే పరిమితం కాదు. రామానుజన్ జీన్స్ నుంచి వచ్చిన ప్రీతి ముకుందన్ తిరుచిరాపల్లి ఎన్‌ఐటీ లో బీటెక్ పూర్తి చేసినప్పటికీ, తన కెరీర్‌గా గ్లామర్ ప్రపంచాన్ని, నటనను ఎంచుకోవడం ఇందుకు చక్కటి ఉదాహరణ.

మేధస్సు రూపం మారినా.. సృజనాత్మకత ఒక్కటే:

శ్రీనివాస రామానుజన్ సంఖ్యల వెనుక ఉన్న రహస్యాలను శోధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అది ఒక రకమైన అద్భుత క్రియేటివిటీ ఇప్పుడు అదే రక్తం పంచుకు పుట్టిన ప్రీతీ ముకుందన్ కెమెరా ముందు నవరసాలను పలికిస్తూ కళాత్మక సృజనాత్మకతను చూపిస్తోంది. లెక్కల్లో నంబర్లను పేర్చడం వెనుక ఎంతటి ఏకాగ్రత, బుద్ధికుశలత అవసరమో.. ఒక నటిగా స్క్రీన్ పై ఎక్స్‌ప్రెషన్స్ పలికించాలన్నా అంతే మైండ్ పవర్ కావాలి. రూట్ మారినా, వారిలోని టాలెంట్ జీన్స్ వేరే రూపంలో వ్యక్తమవుతున్నాయి.

సమాజపు అంచనాలను దాటుకుంటూ ముందుకు:

మన సమాజంలో ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ వారసులు అదే ఫీల్డ్ లోకి వెళ్లాలని ఆశిస్తుంటారు. ముఖ్యంగా రామానుజన్ లాంటి లెజెండ్స్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అనగానే పిల్లలందరూ సైంటిస్టులు అయిపోవాలనే భ్రమల్లో ఉంటారు. కానీ ప్రీతి ముకుందన్ వాటన్నిటినీ బ్రేక్ చేసింది. తాతల కాలం నాటి గొప్పతనాన్ని గౌరవిస్తూనే, తనకు నచ్చిన యాక్టింగ్ ఫీల్డ్‌లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. చదువులో గ్రేట్ అనిపించుకుంటూనే, నటనలోనూ తానేంటో నిరూపించుకుంటోంది.

జీన్స్ అనేవి కేవలం వృత్తులను మాత్రమే బదిలీ చేయవు, అవి ఒక మనిషిలోని ఆలోచనా శక్తిని, క్రియేటివిటీని బదిలీ చేస్తాయి. రామానుజన్ వారసత్వం నుండి వచ్చిన ఈ 'బ్లాస్ట్' బ్యూటీ, నంబర్లతో లెక్కలు వేయకపోయినా వెండితెరపై తన గ్లామర్, నటనతో సక్సెస్ లెక్కలను సరిచేస్తోంది. మేధావుల కుటుంబం నుండి వచ్చిన ఈ కొత్త తరం నటి, భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..

Tags:    

Similar News