ప్రశాంత్ నీల్.. ఆ ప్లేస్ కొట్టేశారా?
భారీ ఎలివేషన్స్, డార్క్ యాక్షన్ బ్యాక్ డ్రాప్, పవర్ ఫుల్ హీరో ప్రెజెంటేషన్ అంటే ముందుగా గుర్తొచ్చే దర్శకుల్లో ప్రశాంత్ నీల్ టాప్ లో ఉంటుందనే చెప్పాలి.
భారీ ఎలివేషన్స్, డార్క్ యాక్షన్ బ్యాక్ డ్రాప్, పవర్ ఫుల్ హీరో ప్రెజెంటేషన్ అంటే ముందుగా గుర్తొచ్చే దర్శకుల్లో ప్రశాంత్ నీల్ టాప్ లో ఉంటుందనే చెప్పాలి. కన్నడ సినిమా నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు చేరుకుంది. రీసెంల్ గా విడుదలైన డ్రాగన్ గ్లింప్స్ తర్వాత ప్రశంసల వర్షం కురుస్తోంది.
2014లో వచ్చిన ఉగ్రమ్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నీల్.. మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించారు. అయితే ఆయనకు పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం కేజీఎఫ్ సిరీస్. హీరో యష్ లీడ్ రోల్ లో రూపొందిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేశాయి. బంగారు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ చిత్రాలు యాక్షన్ సినిమాలకు కొత్త డెఫినేషన్ ఇచ్చాయి.
ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన సలార్ ద్వారా కూడా నీల్ తన స్టైల్ ను మరోసారి నిరూపించుకున్నారు. బొగ్గు గనులు, భారీ యాక్షన్ సీన్లు, రవి బస్రూర్ ఇచ్చిన పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ అసెట్ గా నిలిచాయి. ఇప్పుడు అదే ఫార్మాట్ ను మరింత వైల్డ్ గా డ్రాగన్ లో చూపించబోతున్నారనే అభిప్రాయం గ్లింప్స్ చూసిన వెంటనే కలుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ గ్లింప్స్ దాదాపు నాలుగు నిమిషాలకుపైగా నిడివితో ఒక మినీ ట్రైలర్ లా కనిపించింది. సాధారణ గ్లింప్స్ లా కాకుండా సినిమా ప్రపంచాన్ని పూర్తిగా పరిచయం చేస్తూ కట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత భారతదేశంలో నడిచిన ఓపియం వ్యాపారాన్ని కథకు బ్యాక్ డ్రాప్ గా ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది.
గ్లింప్స్ లో ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ కొత్త షేడ్స్ లో చూపించారు. చుట్టూ శవాల మధ్య నిలబడి కనిపించే సీన్, డార్క్ కలర్ టోన్, భారీ గన్స్, గ్యాంగ్ స్టర్ సామ్రాజ్యం.. ఇవన్నీ నీల్ మార్క్ మేకింగ్ ను మరోసారి గుర్తు చేశాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ వైల్డ్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే సినిమా హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలను ఒక ప్రత్యేక స్టైల్ లో చూపించడం కామన్. డార్క్ షేడ్స్, రగ్గడ్ లుక్, నల్ల బనీన్, భారీ ఎలివేషన్ షాట్లు ఆయన ట్రేడ్ మార్క్ గా మారిపోయాయి. ఉగ్రమ్ నుంచి కేజీఎఫ్, సలార్ వరకు అదే ప్యాటర్న్ కనిపించగా.. ఇప్పుడు డ్రాగన్ లో ఎన్టీఆర్ కూ అదే ట్రీట్మెంట్ ఇచ్చాడు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
సోషల్ మీడియాలో అయితే ప్రశాంత్ నీల్ హీరోలను కాదు.. మాన్స్టర్లను క్రియేట్ చేస్తారంటూ తారక్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా డ్రాగన్ గ్లింప్స్ తో ప్రశాంత్ నీల్ మరోసారి తన స్టాంప్ చూపించారనే చెప్పాలి. దీంతో సినిమాపై అంతా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు, తారక్ ఫ్యాన్స్.. ఎక్కువగా ఎదురు చూస్తున్న దర్శకుల్లో టాప్ ప్లేస్ కొట్టేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.