• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రాజెక్ట్ O.. అంతా...

ప్రాజెక్ట్ O.. అంతా చకచకా...

| సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం.. ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-03-24 05:43 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. సంచలనంగా మారారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. డెబ్యూ మూవీతో నేషనల్ వైడ్ గా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందారు. ఇటీవల హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం.. ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

హనుమాన్ మూవీ తర్వాత యంగ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరికీ మంచి ఆసక్తి నెలకొంది. ప్రశాంత్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఫస్ట్ మూవీ హనుమాన్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత.. దాని సీక్వెల్ జై హనుమాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే దీని కన్నా ముందు మరో సినిమాతో బిజీగా మారారు.

ప్రశాంత్ వర్మ ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన ఆక్టోపస్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. టిల్లు స్క్వేర్ మూవీతో మరికొద్ది రోజుల్లో సందడి చేయనున్న అనుపమ పరమేశ్వరన్.. ఆక్టోపస్ లో హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కొన్ని అనివార్య కారణాలతో హోల్డ్ లోకి వెళ్లిపోయింది. తాజాగా ఈ మూవీ కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారు మేకర్స్.

ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ తోపాటు మరికొందరు బ్యూటీలు నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఐదుగురు మహిళలు ఒక డేంజర్ ఇష్యూలో చిక్కుకుపోయినప్పుడు తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ లైన్ గా తెలుస్తోంది. ఈ మూవీని తొలుత ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపించిన తర్వాత థియేటర్ రిలీజ్ చేసే ఆలోచనలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఉన్నట్టు సమాచారం.

ఆక్టోపస్ మూవీ రిలీజ్ డేట్ తోపాటు మరిన్ని వివరాలు త్వరలోనే ప్రశాంత్ వర్మ ప్రకటించనున్నారు. అయితే జై హనుమాన్ కన్నా ముందు మరో సూపర్ హీరో మూవీ అధీరాను కూడా ప్రకటించారు. ఈ చిత్రంతో ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు హీరోగా పరిచయం కానుండగా.. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ మూవీ చేతులు మారినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాపై ప్రశాంత్ వర్మ ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.

Tags:    
  • HanuMandirector 
  • Prasanthvarma 
  • ProjectO 
  • Anupamaparameswaran 
  • Octopusmovie 
  • Tollywood 
  • Anupama 
  • Tillusquare 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS