• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కుంభమేళాలో పుణ్యస్నానం......

కుంభమేళాలో పుణ్యస్నానం... ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్!

| విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్.. తరచూ రాజకీయ పరమైన అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తారనే సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-01-29 04:13 GMT

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్.. తరచూ రాజకీయ పరమైన అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తారనే సంగతి తెలిసిందే. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. ఈ క్రమంలో తరచూ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తుంటారని అంటారు.

ఇదే సమయంలో.. కుల, మతాల పేరు చెప్పి పబ్బం గడుపుకునే వారిపై ఫైర్ అవుతుంటారని చెబుతుంటారు. మనిషి బ్రతకటానికి కావాల్సింది కూడు, గూడు, బట్ట, ఆరోగ్యం, విద్య వంటివని.. ప్రభుత్వాలు ప్రజలకు వాటిని అందించడంపై శ్రద్ధ పెట్టాలి కానీ కులాలు, మతాల పరంగా విభజించకుడదని అంటుంటారు.

ఈ క్రమంలో చాలా మంది శత్రువులను, ఎంతో మంది మిత్రులను సోషల్ మీడియా వేదికగా సంపాదించుకున్నారని అంటారు. అలాంటి ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నట్లు, త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించినట్లు ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అవును... ప్రకాశ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొన్నట్లు ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో... "నాస్తికుడని చెప్పుకొనే మీరు కుంభమేళాకి ఎలా వెళ్లారు"?.. "చెప్పేవాటికి చేసేవాటికి పొంతనలేదు.. మీకు, చాలా మంది రాజకీయ నాయకులకు తేడా ఏముంది?" అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చాయి.

దీంతో... ఈ ఫోటో ప్రకాశ్ రాజ్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... "ఫేక్ న్యూస్ అలర్ట్" అని టైటిల్ పెట్టి.. "ఫేకు మహారాజ్" కి సంబంధించిన మతోన్మాదులు, పిరికి సైన్యానికి సంబంధించిన చివరి అస్త్రం ఇది" అని ఘాటుగా స్పందించారు.

ఇదే సమయంలో.. "వారి పవిత్ర వేడుకల్లో కూడా ఫేక్ న్యూస్ లు వ్యాప్తి చేయడం ఎంత అవమానకరం" అని అంటు.. ఆ "జోకర్లపై ఫిర్యాదు చేశాను.. పరిణామాలను ఎదుర్కోండి" అని రాశారు. దీంతో.. ఆ ఫోటో కంటే ఎక్కువగా ఇప్పుడు ఈ రియాక్షన్ వైరల్ అవుతోందని అంటున్నారు. ఆ "ఫేకు మహారాజు" ఎవరనేది ఆసక్తిగా మారింది!

FAKE NEWS ALERT
the last resort of bigots and coward army of “Feku Maharaj” is to stoop down and spread FAKE NEWS.. even during theire Holy ceremony.. what a SHAME .. Complaint has been filed against the Jokers .. face the consequences #justasking pic.twitter.com/xpftHyrPoA

— Prakash Raj (@prakashraaj) January 28, 2025
Tags:    
  • Prakashraj 
  • Actor 
  • Filmindustry 
  • Fakephoto 
  • Kumbhmela 
  • Uttarpradesh 
  • Fekumaharaj 
  • Movies 

Similar News

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS