ప్రకాష్‌రాజ్ బ్యాన్..నెట్టింట పెరుగుతున్న డిమాండ్!
దీంతో ప్రకాష్ రాజ్ వివాదం ముదురు తోంది. కొంత మంది సామాన్య ప్రజల డబ్బులతో పాపులారిటీని, ఆస్తులని కూడబెట్టుకున్న ఆయన్ని సినిమాల నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.;
కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు విలక్షణ నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్. ఆయన ఇటీవల యావత్ భారతం మర్యాద పురుషోత్తముడిగా కీర్తించే శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్‌పై బీజేపీ పార్టీ నాయకుడు కేసు ఫైనల్ చేయించారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా నెటిజన్‌లు, ప్రముఖులు ప్రకాష్ రాజ్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. మేధావినని తనకు తాను ప్రకటించుకున్న ప్రకాష్ రాజ్ కేవలం హిందుత్వాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.
ఇటీవల ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. టీసీఎస్‌లో లవ్ జీహాద్ బయటపడి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఓ వర్గానికి చెందిన ఓ యువకుడు 180 మందికి పైగా హిందూ అమ్మాయిల వీడియోలని రికార్డ్ చేయడం తీవ్ర కలకలం రేపింది. వీటిపై స్పందించని ప్రకాష్ రాజ్ రామాయణాన్ని, శ్రీరాముడిని కించపరుస్తూ కేరళ లిటరేచర్ ఫెస్టివెల్‌లో కామెంట్ లు చేయడం విడ్డూరంగా ఉందని పలువురు ప్రముఖులు, నెటిజన్‌లు ఫైర్ అవుతున్నారు.
దీంతో ప్రకాష్ రాజ్ వివాదం ముదురు తోంది. కొంత మంది సామాన్య ప్రజల డబ్బులతో పాపులారిటీని, ఆస్తులని కూడబెట్టుకున్న ఆయన్ని సినిమాల నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. రామాయణంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలు దెబ్బ తీయడంతో సినిమాల్లో ఆయనని బ్యాన్ చేయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. రీఎంట్‌గా తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓ వీడియోని విడుదల చేసిన ప్రకాష్ రాజ్ నాకు శ్రీరాముడిని అవమానించే అవసరం లేదని చెప్పారు. అయితే ఆయన స్వరంలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
ఇది తాజా వివాదాన్ని మరింత రగిలేలా చేసింది. దీంతో చాలా మంది ప్రకాష్ రాజ్‌పై మండిపడుతూ ఆయనకు అవకాశాలు ఇచ్చిన జక్కన్న, సందీప్‌రెడ్డి వంగ, అజయ్ దేవగన్ (దృశ్యం 3)లు మరో సారి ప్రకాష్ రాజ్ గురించి ఆలోచించాలని, ఆయనని తమ సినిమాల నుంచి తొలగించి ఆర్టిస్ట్‌గా బ్యాన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. నెట్టింట ప్రకాష్‌రాజ్ బ్యాన్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది.
గతంలో `గుడుంబా శంకర్` టైమ్‌లో ఆశిష్ విద్యార్థి చేసిన క్యారెక్టర్ కోసం టీమ్ ముందు ప్రకాష్ రాజ్‌ని సంప్రదించింది. అయితే వారిని తిరస్కరించి ప్రకాష్ రాజ్ అవమానించడం, మిగతా సినిమాల విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించడంతో అప్పట్లో దీన్ని సీరియస్‌గా తీసుకున్న `మా` అసోసియేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్‌ని బ్యాన్ చేసింది. ఆ తరువాత చిరంజీవిని ప్రకాష్ రాజ్ ప్రసన్నం చేసుకోవడంతో బ్యాన్‌ని తొలగించారు. మళ్లీ ఆనాటి రోజుల్ని గుర్తు చేయాలని, ప్రకాష్ రాజ్‌ని తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ బ్యాన్ చేయాలని నెటిజన్‌లు, సినీ లవర్స్, రామభక్తులు డిమాండ్ చేస్తున్నారు.