అందుకే కోటా అందరికీ నచ్చరు!
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమాలో తెలుగు వారినే తీసుకోవాలనే ఉద్దేశంతో ఉండేవారు.;
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమాలో తెలుగు వారినే తీసుకోవాలనే ఉద్దేశంతో ఉండేవారు. దానికి కారణం ఆయన రంగస్థల నటుడు అవడం. రంగస్థల రూల్స్ ప్రకారం ఎక్కడి వాళ్లు అక్కడే నటించాలి. వేరే ప్రాంతాలకు చెందిన వారు వచ్చి ఇక్కడ నటిస్తే సొంత ప్రాంతాల వారికి ఉపాధి దెబ్బతింటుందనేది ఆయన ఉద్దేశం. అలాంటి కోటాను కన్నడ నుంచి వచ్చిన టాలీవుడ్ కు వచ్చిన ప్రకాష్ రాజ్ ఎంట్రీ చాలా ఇబ్బంది పెట్టింది. తనకు వచ్చే ఛాన్సులన్నీ ప్రకాష్ రాజ్‌కు వెళ్లిపోతున్నాయని ఎన్నో సార్లు డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ ను ఎటాక్ కూడా చేశారు కోటా. మా ఎలక్షన్స్ టైమ్ లో కూడా ప్రకాష్ రాజ్ పై కోటా విమర్శలు చేశారు.
దీంతో కోటాకు, ప్రకాష్ రాజ్ కు మధ్య చాలా గ్యాప్ ఉందని, వారిద్దరికీ అసలు పడదని అంతా ఫిక్సైపోయారు. కానీ తమ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉందని కోటాకు నివాళులర్పిస్తున్న సందర్భంగా ప్రకాష్ రాజ్ తెలిపారు. ఆదివారం కోటా మరణంతో టాలీవుడ్ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనకు నివాళులర్పించడానికి ఎంతో మంది రాగా అందులో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. కోటాకు నివాళులర్పించాక ఆయనతో తనకున్న అనుబంధాన్ని వివరించారు ప్రకాష్ రాజ్.
కోటాకు తనపై ఉన్న ఒపీనియన్ తో పాటూ తన గురించి కోటా చేసిన వ్యాఖ్యలు గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. కోటా సినిమాలు చూసి తానెంతో నేర్చుకున్నానని, యాక్టింగ్ పై ఆయనకున్న కమాండ్ తనను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసిందని, టాలీవుడ్ లోకి వచ్చాక ఆయనతో కలిసి పలు సినిమాల్లో పని చేసే ఛాన్స్ దక్కిందని ప్రకాష్ రాజ్ చెప్పారు.
కోటా చాలా స్పెషల్ పర్సన్ అని, అందుకే ఆయన అందరికీ నచ్చరని చెప్పారు. ప్రకాష్ రాజ్ పరభాషా నటుడు కదా అని ఎవరో ఆయన దగ్గర ప్రస్తావిస్తే కాదండీ, ప్రకాష్ తెలుగు నేర్చుకుని మన వాడు అయిపోయాడని చెప్పేవారని, తనపైన ఆయనెన్నో సెటైర్లు వేసేవారని, కానీ వాటన్నింటినీ తాను సరాదాగానే తీసుకునేవాడినని ప్రకాష్ రాజ్ తెలిపారు. లాస్ట్ ఇయర్ బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, తాను కలిసి ఓ షూటింగ్ లో పాల్గొన్నామని, ఆ టైమ్ లో కోటా గుర్తొచ్చారని, ఆయనకు హెల్త్ బాలేని విషయం తెలిసి ఫోన్ చేసి మాట్లాడానని, వీలుంటే సెట్ కు రమ్మని అడిగి వెహికల్ పంపిస్తే సెట్స్ కు వచ్చి సరదాగా గడిపారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. మొన్నటివరకు కోటాకు, ప్రకాష్ రాజ్ కు మధ్య చాలా గొడవలున్నాయనుకున్న అందరికీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వారిద్దరి మధ్య చాలా మంచి సాన్నిహిత్యమే ఉన్నట్టు క్లారిటీ వచ్చింది.