గ్రీస్ బీచ్‌లో ప్రగ్యా జైస్వాల్ హల్‌చల్.. మైకోనోస్‌లో కళ్లుచెదిరే అందం!

టాలీవుడ్ లో 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్, తాజాగా గ్రీస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మైకోనోస్‌లో ప్రత్యక్షమైంది.

Update: 2026-09-11 11:34 GMT

టాలీవుడ్ లో 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్, తాజాగా గ్రీస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మైకోనోస్‌లో ప్రత్యక్షమైంది. సోషల్ మీడియాలో నిత్యం ఫ్యాషన్, ఫిట్‌నెస్ పిక్స్‌తో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ, సముద్రం ఒడ్డున దిగిన అద్భుతమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నీలిరంగు సముద్రం, పడవల బ్యాక్‌డ్రాప్‌లో ప్రగ్యా ఇచ్చిన ఎవర్ గ్రీన్ పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తూ నెటిజన్లను విపరీతంగా అలరిస్తున్నాయి.




 


'హలో మైకోనోస్' అంటూ క్లాసీ పిక్స్:

ఈ వెకేషన్‌లో ప్రగ్యా జైస్వాల్ 'స్టూడియో వేరాందా' బ్రాండ్‌కు చెందిన మల్టీవే వ్రాప్ టై హాల్టర్ స్కార్ఫ్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. బ్లూ పాటర్న్ ఫ్లోరల్ డ్రెస్‌కి మ్యాచింగ్‌గా 'ఐ జ్యువెల్స్' ఇయర్ రింగ్స్, 'ఐమోడ్' సన్‌గ్లాసెస్, 'ఫ్లట్టర్' ఫుట్‌వేర్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. "హలో మైకోనోస్" అంటూ క్యాప్షన్ జత చేసి పోస్ట్ చేసిన ఈ పిక్స్ చూసి అభిమానులు లవ్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ను నింపేస్తున్నారు.




 


బ్యాక్‌గ్రౌండ్‌తో పోటీ పడుతున్న అందం:

ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ అయిన మైకోనోస్ అందమైన బీచ్‌లు, వైట్ బిల్డింగ్స్, సన్‌సెట్స్‌కు చాలా ఫేమస్. సెలబ్రిటీలు ఇష్టపడే ఈ ప్లేస్‌లో ప్రగ్యా ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా నేచురల్‌గా కనిపించడం విశేషం. సముద్రపు కాంతుల మధ్య చిరునవ్వు చిందిస్తున్న ప్రగ్యా లుక్‌ని చూసి"బ్యూటిఫుల్", "అబ్సల్యూట్లీ స్టన్నింగ్" అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.




 


'అఖండ' నుంచి 'డాకూ మహారాజ్' వరకు :

'కంచె'తో గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా, నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన చేసిన 'అఖండ' సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత బాలయ్యతోనే కలిసి 'డాకూ మహారాజ్' సినిమాలో కావేరి పాత్రలో నటించి అలరించింది. అంతేకాకుండా హిందీలో అక్షయ్ కుమార్‌తో కలిసి 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలోనూ మెరిసి బాలీవుడ్‌లోనూ తన ముద్ర వేసింది.




 


ఇక ఇప్పుడు ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు మాత్రం నెట్టింట రచ్చ లేపుతున్నాయి నిత్యం తన ట్రావెల్ మూమెంట్స్‌ను పంచుకుంటూ అభిమానులకు కంటికి ఇంపుగా నిలుస్తోంది. వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ప్రగ్యా జైస్వాల్, రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో అలరిస్తూ తన విజయాన్ని కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News