• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అయ్యో! లోకేష్ నెంబర్‌ ను...

అయ్యో! లోకేష్ నెంబర్‌ ను రాజమౌళి బ్లాక్ చేసేశారా?

| ఈ ఫోన్ ఎవరిది అసలు?' అంటూ అడిగింది. దానికి రాజమౌళి కూడా కూల్‌ గా 'నా పేరు రాజమౌళి' అని చెప్పారు. ఇక్కడితో కథ కంప్లీట్ అయిపోయిందనుకుంటే..

By - M Prashanth
Update: 2026-09-11 11:30 GMT

సాధారణంగా సెలబ్రిటీలతో ఫోన్‌ లో మాట్లాడాలంటే ముందుగా అపాయింట్మెంట్ కావాలి. కానీ ఏపీ మంత్రి నారా లోకేష్‌ కు మాత్రం ఓ యూత్ టాక్ షోలో అలాంటి అవసరమే రాలేదు. అక్కడున్న కొందరు స్టూడెంట్స్ ఏకంగా దర్శకధీరుడు రాజమౌళికి ఫోన్ చేయాలని ఛాలెంజ్ చేశారు. దీంతో లోకేష్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా తన ఫోన్ తీసి జక్కన్నకు కాల్ చేశారు. అక్కడి నుంచే అసలు కామెడీ మొదలైంది.

ది అండర్ 18 వరల్డ్ అనే యూత్ టాక్ షోలో పాల్గొన్న లోకేష్‌ కు చిన్నారులు ఆ క్రేజీ ఛాలెంజ్ విసిరారు. రాజమౌళికి మీ ఫోన్ నుంచి కాల్ చేయాలని కోరారు. దీంతో లోకేష్ తన పర్సనల్ ఫోన్ నుంచి జక్కన్నకు డయల్ చేశారు. కొద్దిసేపటికే రాజమౌళి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నారు. ఇక అప్పటివరకు అంతా నార్మల్ గానే ఉంది. కానీ ఫోన్ అందుకున్న చిన్నారి వెంటనే తన స్టైల్‌ లో రాజమౌళితో మాట్లాడటం మొదలుపెట్టింది.

'హలో.. ఈ ఫోన్ ఎవరిదో కింద పడింది. ఓనర్ ఎవరో తెలుసుకుందామని చూస్తే ఫేవరెట్ లిస్ట్‌లో మీ నెంబర్ ఉంది. ఈ ఫోన్ ఎవరిది అసలు?' అంటూ అడిగింది. దానికి రాజమౌళి కూడా కూల్‌ గా 'నా పేరు రాజమౌళి' అని చెప్పారు. ఇక్కడితో కథ కంప్లీట్ అయిపోయిందనుకుంటే.. ఆ చిన్నారి వేసిన తర్వాతి ప్రశ్నే అసలు హైలైట్. 'రాజమౌళి అంటే ఎవరు?' అని అడిగింది.

అంతేకాదు.. ఆ తర్వాత తన పేరు చెప్పడంతో రాజమౌళి వెంటనే కాల్ కట్ చేశారు. ఇదంతా చూస్తున్న లోకేష్‌ తో పాటు అక్కడున్నవాళ్లు కూడా ఫుల్ గా నవ్వుకున్నారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. లోకేష్ మళ్లీ రాజమౌళికి కాల్ చేసి ఈ ప్రాంక్‌ కు అపాలజీ చెబుతానని అన్నారు. కానీ అప్పటికే జరిగిన సిచ్యువేషన్ ను గుర్తు చేసుకుని.. 'నా నెంబర్‌ను బ్లాక్ చేశారేమో' అంటూ సరదాగా నవ్వేశారు.

అలా చిన్నారులు వేసిన ఓ చిన్న ఛాలెంజ్.. లోకేష్, రాజమౌళి మధ్య ఓ ఫన్నీ ఫోన్ కాల్‌ గా మారింది. సాధారణంగా రాజమౌళి పేరు చెప్పగానే ఆయన సినిమాలు, భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా రేంజ్ గుర్తుకొస్తాయి. కానీ ఈసారి మాత్రం ఓ చిన్నారి అడిగిన 'రాజమౌళి అంటే ఎవరు?' అనే ప్రశ్నే సోషల్ మీడియాలోనూ, ఈ షోలోనూ అసలైన ఫన్నీ మూమెంట్ గా మారింది. ప్రస్తుతం రాజమౌళి తన నెక్స్ట్ మూవీ 'వారణాసి' పనుల్లో బిజీగా ఉన్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది.

మరోవైపు లోకేష్ ఏపీ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్యలో ఓ టాక్ షోలో చిన్నారుల ఛాలెంజ్‌ ను తీసుకుని.. ఏకంగా రాజమౌళికి ఫోన్ చేయడం మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. అయితే అదేం పెద్ద విషయం కాదు. కానీ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత రాజమౌళి అంటే ఎవరు? అనే ప్రశ్న రావడమే అసలు ట్విస్ట్. అందుకే ఇప్పుడు సరదాగా.. అయ్యో! రాజమౌళి అంటే ఎవరో తెలియదా? లోకేష్ నెంబర్‌ ను రాజమౌళి బ్లాక్ చేసేశారా? అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

అక్కడ తెలంగాణలో KTR ఫోన్‌తో ప్రభాస్‌కు ప్రాంక్ కాల్..ఇక్కడ ఆంధ్రలో లోకేశ్ ఫోన్‌తో రాజమౌళికి ప్రాంక్ కాల్! 😂🔥తెలంగాణలో డార్లింగ్ టార్గెట్.. ఆంధ్రలో జక్కన్న టార్గెట్! 😄ఇద్దరు టాప్ సెలబ్రిటీలతో ఇద్దరు కీలక నేతల పేర్లు.. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంక్ కాల్స్ ఇప్పుడు సోషల్… pic.twitter.com/900YytRsX5

— Tupaki (@tupaki_official) September 11, 2026
Tags:    
  • naralokesh 
  • ssrajamouli 
  • rajamouli 
  • youthtalkshow 
  • viral 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS