పిక్‌టాక్ : బాత్‌రూంలో బికినీతో అందాల ప్రగ్యా!
దశాబ్దం క్రితం టాలీవుడ్‌లో వచ్చిన 'కంచె' సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఎక్కువ సినిమాల్లో నటించింది.;
దశాబ్దం క్రితం టాలీవుడ్‌లో వచ్చిన 'కంచె' సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఎక్కువ సినిమాల్లో నటించింది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వచ్చాయి. పైగా ఈ అమ్మడు ఎక్కువ శాతం చిన్న హీరోలతో, మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసింది. బాలకృష్ణ వంటి స్టార్‌తో సినిమాను చేసినా అది పెద్దగా కలిసి రాలేదు. అదృష్టం కలిసి రాకపోవడంతో ప్రగ్యా జైస్వాల్ దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో కొట్టు మిట్టాడుతూనే ఉంది. ఆఫర్ల కోసం ఎప్పుడూ ఈమె ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఈమె రెగ్యులర్‌గా అందమైన ఫోటోలతో సందడి చేస్తూనే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 30 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు స్కిన్ షో ఫోటోలు షేర్ చేసిన ప్రతి సారి వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలతో సర్‌ప్రైజ్ చేసింది. ప్రగ్యా అందాల ఆరబోత ఫోటోలు సాధారణంగానే సోషల్ మీడియాలో హీట్ పెంచుతాయి. అలాంటిది బికినీలో అది కూడా టూ పీస్ బికినీలో కనిపిస్తే ఇంకా ఏమైనా ఉందా... తాజాగా ప్రగ్యా టూ పీస్ బికినీతో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. అంతే కాకుండా కుర్రకారు చూపు తిప్పుకోకుండా చేసింది.
సాధారణంగా బికినీ బీచ్‌లో ఉన్నప్పుడు ధరించి, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో సెలబ్రిటీలు షేర్ చేయడం కామన్ విషయం. కానీ ప్రగ్యా జైస్వాల్ మాత్రం బాత్ రూంలో బికినీలో ఉండి సెల్ఫీ తీసుకుని షేర్ చేసింది. ఈ స్టైలిష్ బికినీ ట్రీట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాబోయ్ ఇదేం అరాచకం అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ చాలా సార్లు నిరూపితం అయ్యింది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలు ఎప్పటిలాగే వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలతో అయినా ప్రగ్యా జైస్వాల్‌కి సినిమాల్లో ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
ఈ సంవత్సరం ఆరంభంలో బాలకృష్ణతో వచ్చిన డాకు మహారాజ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరో వైపు ఈమె బాలయ్య తో అఖండ 2 సినిమాలోనూ నటిస్తున్న సమాచారం అందుతోంది. ఇప్పటివరకు బాలకృష్ణతో చేసిన అఖండ, డాకు మహారాజ్ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అఖండ 2 పై చాలా ఆశలు పెట్టుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమా ఇదే ఏడాదిలో విడుదల కాబోతుంది. మరో వైపు ఈమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.