కోలీవుడ్ యంగ్ హీరోకు కొత్త సమస్య
ఒకప్పటిలా ఇప్పుడు సినిమాలు ఎక్కువ రోజులు ఆడటం లేదు. ఒకప్పుడంటే వారానికి ఒక సినిమానే వచ్చేది, ఆ సినిమానే చాలా రోజుల పాటూ థియేటర్లలో రన్ అయ్యేది.;
ఒకప్పటిలా ఇప్పుడు సినిమాలు ఎక్కువ రోజులు ఆడటం లేదు. ఒకప్పుడంటే వారానికి ఒక సినిమానే వచ్చేది, ఆ సినిమానే చాలా రోజుల పాటూ థియేటర్లలో రన్ అయ్యేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. పోటీ ఎక్కువైపోయింది. ఏదైనా సినిమా నాలుగు వారాలు కంటిన్యూగా ఆడితే చాలా బాగా ఆడిందనుకునే రోజులకు వచ్చేశాం.
పోటీ అంతలా పెరిగిపోయింది. ప్రతీ వారం ఎన్నో సినిమాలు రిలీజవుతూ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే తమ సినిమాకు పోటీ లేకుండా సోలోగా రిలీజ్ డేట్ ను చూసుకుందామనుకుంటారు. కానీ ఓ యంగ్ హీరోకు ఇప్పుడో వింత సమస్య వచ్చింది. తను నటించిన ఒక సినిమాతో మరో సినిమా పోటీ పడుతుంది. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.
తన సినిమాతోనే తనకు పోటీ
లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకుని కెరీర్లో దూసుకెళ్తున్న ప్రదీప్ నుంచి ఈ దీపావళికి రెండు సినిమాలు రానున్నాయి. ప్రదీప్ ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డ్యూడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండింటిలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా, డ్యూడ్ దీపావళికి రిలీజ్ కానుందని ముందు అనుకున్నారు.
కానీ ఇటీవల లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్మాతలు తమ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత డ్యూడ్ చిత్ర మేకర్స్ కూడా తమ సినిమాను దీపావళికే రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు రిలీజవుతుండటం ప్రదీప్ కు ఓ పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల నష్టపోయేది అతనే. ఎందుకంటే ఒక సినిమా ఆడితే మరో సినిమాకు నష్టం తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రదీప్ సిట్యుయేషన్ ను అర్థం చేసుకుని మేకర్స్ ఏదైనా ఒక సినిమాను వాయిదా వేస్తారా లేదా రెండు సినిమాలూ దీపావళికే రిలీజవుతాయా అనేది చూడాలి. ఏదైనా ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేవరకు ప్రదీప్ కు టెన్షన్ తప్పేలా లేదు.