ప్రభాస్ మూవీపై ప్రదీప్ రంగనాథన్ అఫీషియల్ అనౌన్స్మెంట్.. టైటిల్ కన్ఫర్మ్ చేసేసాడా?
విషయంలోకి వెళ్తే.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై డ్యూడ్ సినిమా నిర్మితమవుతున్న విషయం తెలిసిందే.;
ప్రభాస్.. రెబల్ స్టార్ గా, పాన్ ఇండియా హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. బాహుబలి సినిమా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సక్సెస్ - ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్.. తాజాగా మారుతీ దర్శకత్వంలో ' ది రాజాసాబ్' సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. మరోవైపు హనురాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ప్రభాస్. అటు ది రాజాసాబ్ తో పాటు ఇటు హను మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటూ రెండింటిని త్వరగా కంప్లీట్ చేసే పనిలోపడ్డారు ప్రభాస్.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి 'ఫౌజీ' అని టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ సినిమా టైటిల్ ని అనూహ్యంగా లీక్ చేశారు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్. విషయంలోకి వెళ్తే.. కీర్తి స్వరణ్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా.. ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా రాబోతున్న చిత్రం డ్యూడ్. అక్టోబర్ 17వ తేదీన దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని , వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్, నేహా శెట్టి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన ప్రదీప్ రంగనాథన్.. తాజాగా డ్యూడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుకోకుండా ప్రభాస్ - హనురాగవపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ ను లీక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
విషయంలోకి వెళ్తే.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై డ్యూడ్ సినిమా నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇదే బ్యానర్ పై అటు హను రాఘవపూడి - ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా రూపుదిద్దుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ అభిరుచిని వర్ణిస్తూ ప్రదీప్ రంగనాథన్ ఇలా కామెంట్ చేశారు. "నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ప్రభాస్ సార్ నటిస్తున్న ఫౌజీ సినిమాలోని కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. ఆ క్లిప్పింగులు మేకర్స్ అభిరుచిని చూపుతాయి. ఎంతటి అభిరుచి.. అసాధారణం" అంటూ పొగిడేసారు ప్రదీప్ రంగనాథన్.
ఇకపోతే ప్రదీప్ రంగనాథన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇన్ని రోజులు ప్రభాస్ - హనురాగపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ఫౌజీ అనే టైటిల్ రూమర్ గానే వినిపించింది. దీనికి తోడు ఇప్పుడు ప్రదీప్ కూడా అదే టైటిల్ ని ఆక్సిడెంటల్ గా అనౌన్స్ చేయడంతో ఇక ఖచ్చితంగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ అభిమానులందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఏది ఏమైనా ప్రదీప్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినా టైటిల్ పై క్లారిటీ ఇచ్చారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.