• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ ను కొట్టేవాడే...

ప్రభాస్ ను కొట్టేవాడే లేడా?

| ఫ్యాన్ ఇండియా మార్కెట్లో ఇప్పుడు దాదాపు అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలు వారి రేంజ్ ను పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు

By - Tupaki Desk
Update: 2024-03-13 18:12 GMT

ఫ్యాన్ ఇండియా మార్కెట్లో ఇప్పుడు దాదాపు అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలు వారి రేంజ్ ను పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు పేరు మొదట స్ట్రాంగ్ గా వినిపించేది. కానీ ఇప్పుడు ఇండియా లెవెల్ లో సౌత్ హీరోలు కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు హీరోలకు ఏ స్థాయిలో గుర్తింపు అందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దర్శకుల మేకింగ్ విధానానికి మన టాప్ హీరోలు అంతకుమించి అనేలా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఉన్నారు. ఇక అందులో ఇప్పుడు ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను ఎలాంటి సినిమాలు చేసినా కూడా మినిమం కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. దర్శకుల పొరపాట్ల వలన అప్పుడప్పుడు సినిమాల ఫలితాలు తేడా కొడుతున్నప్పటికి ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ తో మాత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అయితే అందుతూ ఉన్నాయి.

ముఖ్యంగా ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో చాలా గట్టిగా వైరల్ అయ్యింది. 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి1 వరకు ఎక్స్ (ట్విట్టర్) లో ట్రెండ్ అయిన టాప్ 10 హ్యాష్ ట్యాగ్ లిస్టు బయటకు వచ్చింది. అయితే ఇండియా మొత్తంలో కూడా అత్యధిక స్థాయిలో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్స్ #Prabhas కూడా ఉంది. టాప్ టెన్ లిస్టులో ప్రభాస్ పేరు ఏడవ స్థానంలో ఉండడం విశేషం.

ఈ లిస్టులో ప్రభాస్ పేరు తప్పితే మిగతా ఏ హీరోల పేర్లు కూడా కనిపించలేదు. కానీ కొన్ని సినిమాల పేర్లు మాత్రం బాగా వైరల్ అయ్యాయి. మూడవ స్థానంలో విజయ్ లియో యాష్ ట్యాగ్ బాగా వైరల్ అయింది. ఇక ఆ తరువాత ఐదవ స్థానంలో జవాన్ ఉండగా ఆరవ స్థానంలో పటాన్ నిలిచింది.

ఇక హీరోలలో మాత్రం ప్రభాస్ పేరు ఒక్కటే బాగా ట్రెండ్ అయినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఆదిపురుష్ కూడా ఈ లిస్టులో 9వ స్థానంలో నిలవడం విశేషం. మొత్తానికి ప్రభాస్ ను కొట్టేవాడు లేడు అని మరోసారి ఈ రికార్డులతో స్పష్టం అవుతుంది మరి రాబోయే రోజుల్లో ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Tags:    
  • Prabhas 
  • Tollywoodhero 
  • Twittertags 
  • Filmindustry 
  • Prabhascraze 
  • Bahubalimovie 
  • Salaarmovie 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS