• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి.. ఆ రెండింటిలో...

సంక్రాంతి.. ఆ రెండింటిలో ఒకటి?

| మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విశ్వంభర మూవీ చేస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-02-07 04:39 GMT

మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. త్రిష సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. అయితే గ్రాఫిక్స్ బేస్డ్ గా సాగే కథలు అనుకున్న డేట్ కి రిలీజ్ కావడం ఇప్పటి వరకు జరగలేదు.

షూటింగ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మీద ఆ సినిమాల రిలీజ్ ఆధారపడి ఉంటాయి. అయితే విశ్వంభర షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సంక్రాంతికి రిలీజ్ కావడానికి ఛాన్స్ ఉంది. మరో వైపు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజాసాబ్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు.

ఈ మూవీ షూటింగ్ వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. డార్లింగ్ ప్రభాస్ హీరోగా హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రాజాసాబ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో సంక్రాంతి సీజన్ లో పోటీ పడితే రెండింటికి కలెక్షన్స్ పరంగా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇద్దరు కూడా పెద్ద స్టార్లే.. రెండు సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడుతుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ పోటీ వలన ఎవరిపైన ఎఫెక్ట్ పడుతుందో చెప్పడం కష్టం కానీ తప్పకుండా ఎంతో కొంత రెండు సినిమాలపై ప్రభావం పడవచ్చు

అయితే ఈ రెండు చిత్రాలు ఒకేసారి రావాలనే నిర్ణయం మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. యూవీ నిర్మాతలతో విశ్వ ప్రసాద్ కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా విశ్వంభర సంక్రాంతికి రిలీజ్ అయితే రాజాసాబ్ వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఒక వేళ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అయ్యి విశ్వంభర లేట్ అయితే మాత్రం రాజాసాబ్ రావడం దాదాపు ఖాయం అని తెలుస్తోంది.

మారుతి అయితే రాజాసాబ్ సినిమాని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రాజాసాబ్ సినిమా మొదలుపెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

Who do you think will win the Andhra Pradesh 2024 election?#AndhraPradeshElections2024 #YSRCP #TDP #Janasena #Tupaki

— Tupaki (@tupaki_official) February 6, 2024
Tags:    
  • Megastar 
  • Chiranjeevi 
  • Vishwabhara 
  • Raajasaab 
  • Prabhas 
  • Maruthi 
  • Sankrantimovies 
  • Pandindianmovies 

Similar News

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

Copyright @2026

Powered by Blink CMS