• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎవరు టచ్ చేయలేని రికార్డ్...

ఎవరు టచ్ చేయలేని రికార్డ్ అందుకొన్న ప్రభాస్

| ఇదిలా ఉంటే తెలుగు హీరోలలో ప్రభాస్ ఖాతాలో ఇప్పటికే రేర్ ఫీట్ చేరింది. నార్త్ ఇండియాలో వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన హీరోల జాబితాలో ప్రభాస్ టాప్ లో ఉన్నాడు.

By - Tupaki Desk
Update: 2023-12-27 07:03 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సలార్. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ప్రతి రోజు వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ మార్క్ ని సలార్ టచ్ చేసింది అంటే సినిమాకి ఏ రేంజ్ లో స్పందన వస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం కలెక్షన్స్ తగ్గిన మరీ గణనీయమైన ఎఫెక్ట్ అయితే లేదు. ఇదిలా ఉంటే తెలుగు హీరోలలో ప్రభాస్ ఖాతాలో ఇప్పటికే రేర్ ఫీట్ చేరింది. నార్త్ ఇండియాలో వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన హీరోల జాబితాలో ప్రభాస్ టాప్ లో ఉన్నాడు. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఖాతాలో మాత్రమే వంద కోట్ల గ్రాస్ రికార్డ్స్ ఉన్నాయి.

అయితే ప్రభాస్ మాత్రం బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాలతో ఇప్పటికే నాలుగు సార్లు వంద కోట్లకి పైగా కలెక్షన్స్ ని నార్త్ ఇండియాలో అందుకున్నాడు. ఇప్పుడు సలార్ కూడా వంద కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఈ మూవీ కలెక్షన్స్ వంద కోట్లు దాటితే ఇప్పటి వరకు ఐదు చిత్రాలతో వంద కోట్లకి పైగా గ్రాస్ సాధించిన హీరోగా ప్రభాస్ నిలిచాడు.

ఈ ఫీట్ సాధించడానికి ప్రభాస్ కి ఎనిమిదేళ్ళు అయ్యింది. మిగిలిన హీరోలు సినిమాల లైన్ అప్ చూస్తుంటే రెండేళ్ళకి ఒక సినిమా లెక్కన ఉంది. ఇదే దారిలో వెళ్తే మిగిలిన హీరోలకి కనీసం దశాబ్దకాలం పట్టే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలు చూసుకుంటే ప్రభాస్ క్రేజ్ కూడా ఈ పదేళ్ళలో మరింత పెరిగిపోతుంది.

కల్కి మూవీ హిట్ అయితే పాన్ వరల్డ్ రేంజ్ వచ్చేస్తుంది. అతని మార్కెట్ కూడా వెయ్యి కోట్లకి చేరిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కల్కి తర్వాత స్పిరిట్, మారుతి సినిమాలు కూడా ప్రభాస్ లైన్ అప్ లో ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Salaar 
  • Salaarmovie 
  • Prabhas 
  • Prasanthneel 
  • Panindia 
  • Hindi 
  • Release 
  • Collections 
  • Boxoffice 

Similar News

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

2026-11-07 06:47 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

Copyright @2026

Powered by Blink CMS