• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుడ్​ న్యూస్​.. ఇద్దరు...

గుడ్​ న్యూస్​.. ఇద్దరు బడా దర్శకులకు ప్రభాస్​ గ్రీన్ సిగ్నల్​

| అవును మీరు విన్నది నిజమే. ఇద్దరు బడా డైరెక్టర్స్​తో సినిమాలు చేసేందుకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే వారెవరో ఇంకా పేర్లు బయటకు రాలేదు.

By - Tupaki Desk
Update: 2023-09-30 13:11 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​కు 'బాహుబలి 2' తర్వాత ఒక్క హిట్​ లేకపోయినా ఆయన లైనప్​ మాత్రం భారీగా ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ ఏడాది సలార్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. సరైన హిట్ లేక సతమతమవుతున్న ప్రభాస్​.. ఈ ఏడాది కచ్చితంగా హిట్ కొడతారని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

అయితే ఇప్పుడు ప్రభాస్​ అభిమానులకు ఓ గుడ్​ న్యూస్​ అందింది. ఆయన మరో రెండు కొత్త ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన సీతారమం డైరెక్టర్​ హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నట్లు, వచ్చే ఏడాది అది సెట్స్​పైకి వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే తాజాగా మళ్లీ ప్రభాస్​ మరో రెండు చిత్రాలను కూడా లాక్​ చేసినట్లు ఫిల్మ్​ సర్కిల్స్​లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అవును మీరు విన్నది నిజమే. ఇద్దరు బడా డైరెక్టర్స్​తో సినిమాలు చేసేందుకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే వారెవరో ఇంకా పేర్లు బయటకు రాలేదు. కానీ త్వరలోనే దీని గురించి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ రాబోతుందని అంటున్నారు. ఇక ఇప్పుడు ఆయన చేతిలో నాగ్​ అశ్విన్​ ప్రాజెక్ట్ కె కల్కి, మారుతి సినిమాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇక ప్రభాస్ కొత్త సినిమాలను లైనలో పెట్టారనే వార్త తెలుసుకుంటున్న అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. ఆ దర్శకులు ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నారు. చూడాలి మరి ఈ ఆ దర్శకులు ఎవరో? ఎలాంటి కథలకు ప్రభాస్ ఓకే చెప్పారో అనేది..

కాగా, ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ మోడలో ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్​గా ఆయన విదేశాలకు వెళ్లి మోకాలి సర్జరీ చేయించుకున్నారట. దీని నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని అంటున్నారు. ఆ తర్వాత ప్రాజెక్ట్​ కె, మారుతితో చేస్తున్న సినిమాలపై ఫోకస్​ పెడతారట. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి అప్పుడు తాను లైన్​లో పెట్టిన కొత్త చిత్రాలను సెట్స్​పైకి తీసుకెళ్తారట.

Tags:    
  • Tollywood 
  • Prabhas 
  • Salaar 
  • Salaarmovie 
  • Newprojects 
  • Lineup 
  • Director 
  • Officalannouncement 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS