ఆ అమ్మాయిల కోస‌మే పెళ్లి చేసుకోలేదు: ప్ర‌భాస్

డార్లింగ్ ప్ర‌భాస్ 'క‌ల్కి 2898 AD' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న క్ర‌మంలో అత‌డు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీ అవుతున్నాడు

Update: 2024-05-23 04:03 GMT

డార్లింగ్ ప్ర‌భాస్ 'క‌ల్కి 2898 AD' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న క్ర‌మంలో అత‌డు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీ అవుతున్నాడు. ఈ బుధ‌వారం సాయంత్రం రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన భారీ ప్ర‌చార వేదిపై అత‌డు ప్ర‌త్యేక వేష‌ధార‌ణ‌తో సినిమాలో త‌న పాత్ర థీమ్ ని ఎలివేట్ చేసే దుస్తుల్లో క‌నిపించాడు. ఇక ఇదే వేదిక‌పై బుజ్జి అనే రోబో (కీల‌క పాత్ర‌)ను సూప‌ర్ కార్ ని ప‌రిచ‌యం చేయ‌డం ఆసక్తిని క‌లిగించింది.

ఈ ఈవెంట్‌కి సుమ యాంక‌రింగ్ మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది. సుమ ఎప్ప‌టిలానే త‌న‌దైన శైలిలో అద్బుత టైమింగ్ తో అంద‌రినీ న‌వ్వించారు. ఈవెంట్ కి విచ్చేసిన ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ స‌హా చిత్ర‌బృందాన్ని ఇంట‌ర్వ్యూలు చేసారు. ఈ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ పెళ్లి గురించిన టాపిక్ అభిమానుల‌ను ఆట‌ప‌ట్టించింది.

అమ్మాయిల గుండెలు ప‌గిలిపోయాయి! అంటూ సుమ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు. మొన్న మీరు ఒక ట్వీట్ చేసారు క‌దా.. లైఫ్ లోకి ఒక‌రు వ‌స్తున్నార‌ని.... ఎంత‌మంది అమ్మాయిల గుండెలు ప‌గిలిపోయాయో తెలుసా? అంటూ ప్ర‌భాస్ ని ఆట‌ప‌ట్టించ‌గా.. దానికి ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ``ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేద``ని ప్ర‌భాస్ న‌వ్వేశారు.

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ గురించి ప్ర‌స్థావిస్తూ `బ‌క్క డైరెక్ట‌ర్` 3 ఏళ్లు బుజ్జితో టార్చ‌ర్ పెట్టాడ‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు.. ఏదో హాయ్ చెప్పి వెళ్లిపోదామనుకుంటే.. ఈ కార్లు.. ఈ వాహ‌నాలు ఏంటి స‌ర్ ఇది? అని నాగ్ అశ్విన్ ని స‌ర‌దాగా ప్ర‌శ్నించారు. ``బుజ్జిని నాకు త‌గిలించాడు మూడు సంవ‌త్స‌రాలు..`` అని కూడా అన్నారు. బుజ్జి బ్రెయిన్ ఉత్త‌మ‌మా? లేదూ బాడీయే బెట‌రా? అని సుమ ప్ర‌శ్నించ‌గా.. బుజ్జి బాడీయే బెట‌ర్.. ఇంత చిన్న బ్రెయిన్ అయినా నా బుర్ర తినేసింది. అందుకే బాడీ బెట‌ర్..! అని ప్ర‌భాస్ అన్నారు.

Tags:    

Similar News