• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరోసారి పూరి కోసం ప్రభాస్

మరోసారి పూరి కోసం ప్రభాస్

| ఓవరాల్ గా సినిమాపై 100+ కోట్లకి పైగా బిజినెస్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-08-03 07:33 GMT

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సాంగ్స్ తో ఒక్కసారిగా మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఓవరాల్ గా సినిమాపై 100+ కోట్లకి పైగా బిజినెస్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది.

డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే డబుల్ ఇస్మార్ట్ మూవీకి 76 కోట్లు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. అలాగే థీయాట్రికల్ రైట్స్ ని అన్ని భాషలకి కలిపి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. దీంతో రామ్ పోతినేని కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరిగిన చిత్రంగా డబుల్ ఇస్మార్ట్ మూవీ నిలిచింది. పూరి, రామ్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కింది.

ఇదలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ని ఆగష్టు 4న వైజాగ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ట్రైలర్ లాంచింగ్ ని వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. తరువాత ప్రీరిలీజ్ ఈవెంట్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారంట. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా డార్లింగ్ ప్రభాస్ ని ఇన్వైట్ చేయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారంట. ప్రభాస్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేశాడు.

ఈ సినిమాలు కమర్షియల్ హీరోగా ప్రభాస్ ఇమేజ్ ని పెంచాయి. బుజ్జిగాడు సినిమాతోనే ప్రభాస్ కి డార్లింగ్ అనే ఇమేజ్ వచ్చింది. అలాగే డబుల్ ఇస్మార్ట్ ప్రొడ్యూసర్ ఛార్మికి కూడా ప్రభాస్ తో మంచి బాండింగ్ ఉంది. ప్రభాస్ చక్రం, పౌర్ణమి సినిమాలలో ఛార్మి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికి పూరి జగన్నాథ్, ఛార్మితో ప్రభాస్ కి మంచి రిలేషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే డార్లింగ్ ని డబుల్ ఇస్మార్ట్ కి చీఫ్ గెస్ట్ గా పిలవాలని అనుకుంటున్నారంట.

ప్రభాస్ కూడా ఈవెంట్ కు మేగ్జిమమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ తో ఉన్న బాండింగ్ కారణంగా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ఎంకరేజ్ చేయడానికి డార్లింగ్ ప్రభాస్ ముందుకొచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాతో 100 కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరుతానని భావిస్తున్నాడు. కావ్య థాపర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • DoubleiSmart 
  • Prereleaseevent 
  • Ram 
  • Kavyathapaar 
  • Purijagannadh 
  • Niranjanreddy 
  • Primeshowentertainment 
  • Prabhas 
  • GuestPrabhas 

Similar News

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

Copyright @2026

Powered by Blink CMS