• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ తరువాత.. అదే...

ప్రభాస్ తరువాత.. అదే స్పీడులో చరణ్ తారక్!

| బాహుబలి సిరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా తన వేవ్ ని కొనసాగిస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-04-06 04:51 GMT

బాహుబలి సిరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా తన వేవ్ ని కొనసాగిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో దాదాపు అదే స్థాయిలో గ్లోబల్ స్టార్స్ గా తారక్, రామ్ చరణ్ మారిపోయారు. ఇప్పుడు వీరిద్దరూ చేయబోయే సినిమాలపై దేశ వ్యాప్తంగా మీడియా వాచ్ ఉంది. అలాగే పబ్లిక్ అటెన్షన్ కూడా ఉంటుంది. చరణ్ లో నార్త్ ఇండియా ఆడియన్స్ ఒక శ్రీరాముడిని చూసారు.

అలాగే తారక్ లో ఒక భీముడిని చూసారు. ఈ కారణంగా ఈ ఇద్దరు హీరోలకి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. ఇంత బిగ్ స్టార్స్ అయిన ఈ ముగ్గురు హీరోలు నెక్స్ట్ రెండేళ్ల వరకు స్ట్రాంగ్ లైన్ అప్ తో సినిమాలు ప్లాన్ చేసుకొని ఉండటం విశేషం. ఇవన్నీ క్రేజీ కాంబినేషన్ లోనే రాబోతున్న మూవీస్ అని చెప్పాలి. డార్లింగ్ ప్రభాస్ అయితే ప్రస్తుతం కల్కి 2898 ఏడీతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు.

రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. పార్ట్ 1 రిలీజ్ కి సిద్ధం అవుతోంది. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సెట్స్ పైనే ఉంది. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ఒకటి ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ కావొచ్చు. ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 2 ఉంది, అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైన సినిమాలు కావడం విశేషం.

ఇక మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేయనున్నారు. అలాగే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇటీవల ఒక సినిమాను లాంచ్ చేశాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో RC17 సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. అలాగే ఓ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో మూవీ చర్చల దశలో ఉంది.

ఇక తారక్ ప్రస్తుతం దేవర మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా చేయబోతున్నాడు. నెక్స్ట్ హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేయబోతున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఉండబోతోంది. దీన్ని కూడా రెండు భాగాలుగా తెరపైకి తీసుకు రానున్నారు. నెక్స్ట్ యష్ రాజ్ బ్యానర్ లో సోలోగా స్పై థ్రిల్లర్ మూవీ తారక్ చేయనున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వం ఒక మూవీ ఉండొచ్చని టాక్ ఉంది. ఈ ముగ్గురు పాన్ ఇండియా సూపర్ స్టార్ చేతిలో వరుసగా మూడు, నాలుగు సినిమాల వరకు లైన్ లో పెట్టుకొని ఉన్నారు.

Tags:    
  • Ramcharan 
  • Gamechanger 
  • RC16 
  • RC17 
  • Prabhas 
  • Kalki2898ad 
  • Salaar2 
  • Ntr 
  • Devara 
  • War2 
  • Panindiaprojects 
  • Tollywood 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS