ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలని చూస్తోన్న రాజా సాబ్
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్నది రాజా సాబ్ సినిమా అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి డిసెంబర్ 5కు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.;
టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల సమస్య చాలా పెద్దదిగా మారిపోయింది. తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి ఎదిగిన నేపథ్యంలో ప్రతీ సినిమానీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమా నిర్మాణానికే చాలా టైమ్ పడుతుంది. ముందు ఒక డేట్ అనుకోవడం ఆ తర్వాత పర్ఫెక్షన్ విషయంలో వివిధ కారణాలతో లేటవడం, క్రమంగా సినిమా వాయిదా పడటం జరుగుతూ వస్తుంది.
అలా వాయిదా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్నది రాజా సాబ్ సినిమా అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి డిసెంబర్ 5కు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. వాస్తవానికి రాజా సాబ్ ఈ ఏడాది మొదట్లోనే రావాల్సింది. కానీ షూటింగ్ లేటవడంతో సినిమా వాయిదా పడి డిసెంబర్ 5న రానున్నట్టు మేకర్స్ ఫిక్స్ చేశారు.
అయితే ఇప్పుడు డిసెంబర్ 5 నుంచి కూడా ది రాజా సాబ్ వాయిదా పడుతుందని కొందరంటుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆల్రెడీ పలుమార్లు పోస్ట్‌పోన్ అయిన రాజా సాబ్ ఈసారైనా చెప్పిన డేట్ కు రావాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే రాజా సాబ్ డిసెంబర్ 5 వాయిదా గురించి ఎన్ని వార్తలొచ్చినా అవన్నీ పుకార్లేనని ఫిక్సైపోవచ్చు.
ఎందుకంటే డిసెంబర్ 5ని మిస్ చేసుకుంటే రాజా సాబ్ కు ఉన్న ఆప్షన్ సంక్రాంతి. ఆల్రెడీ సంక్రాంతికి పలు సినిమాలు కర్ఛీఫ్ వేసుకుని కూర్చున్నాయి. సోలో రిలీజ్ డేట్ ను వదులుకుని సంక్రాంతికి రిలీజ్ డేట్ ను మార్చుకుని కావాలని పోటీగా వెళ్లేంత సాహసం రాజా సాబ్ టీమ్ చేయదు. పైగా పోటీకి వెళ్తే సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశముంది.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజా సాబ్ డిసెంబర్ 5 రిలీజ్ నుంచి తప్పుకునే ఛాన్సే లేదు. పైగా డిసెంబర్ 5కు మంచి సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో అదే రోజున వచ్చిన పుష్ప2, యానిమల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా మామూలుది కాదు. ఇప్పుడు రాజా సాబ్ కూడా అదే డేట్ లో వచ్చి ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేయడంతో పాటూ సోలోగా బాక్సాఫీస్ ను దున్నేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే రోజున రణ్‌వీర్ సింగ్ ధురంధర్ రిలీజవుతున్నప్పటికీ ఆ పోటీని తట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి రాజా సాబ్ రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పని అసలు లేదు.