ది రాజాసాబ్.. మారుతి సర్ ప్రైజ్ ప్లాన్?
ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హారర్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.;
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఈ రెబల్ హీరో, సలార్ 2, కల్కి 2898 ఏడీ 2, స్పిరిట్ లాంటి భారీ ప్రాజెక్టులతో ఫ్యూచర్ ప్లాన్‌లు సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హారర్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ నయా లుక్‌తో ఆ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కథలో భాగంగా ఆ ముగింపు తర్వాత కొనసాగించేలా స్కోప్ ఉందని దర్శకుడు మారుతి భావిస్తున్నారట. ప్రస్తుత షూటింగ్ పూర్తయ్యాక, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి దీని గురించి నిర్ణయం తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇది కేవలం ఆలోచన మాత్రమె అయినా, రాబోయే రోజుల్లో సీక్వెల్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రభాస్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర బృందం వేగంగా షూటింగ్‌ను పూర్తిచేయాలని చూస్తోంది. ఇప్పటికే పలు కారణాలతో సినిమా వాయిదా పడిన నేపథ్యంలో, ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హవేలి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ భారీగా తెరకెక్కుతోంది. విజువల్స్, ఎమోషన్స్, కామెడీ మిక్స్‌తో కొత్త తరహా అనుభూతిని ఇవ్వబోతోందని మారుతి ఇప్పటికే హింట్ ఇచ్చారు. మొత్తానికి ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే, ఓవైపు బడ్జెట్ హంగామా.. మరోవైపు సీక్వెల్ ప్లాన్‌లు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ‘ది రాజాసాబ్ 2’ పేరు చర్చల్లోకి రావడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. మరి ఇది వాస్తవంగా ఫిక్స్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.