ప్రభాస్ 'రాజా సాబ్'.. ఒక్క తెలుగులోనే అన్ని కోట్లా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మరో సినిమాగా రాజా సాబ్ నిలిచినట్లు తెలుస్తోంది.;

Update: 2025-11-26 17:02 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో దర్శకుడు మారుతి ది రాజా సాబ్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా.. మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా.. మేకర్స్ వాటిని భారీగా పెంచుతున్నారు. వరుస అప్డేట్స్ తో ఫుల్ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కు డిమాండ్ ఉందని, అనేక మంది ఎగబడుతున్నారని సమాచారం.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వెర్షన్లకు వేర్వేరుగా బిజినెస్ డీల్స్ జరుగుతున్నట్లు వినికిడి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ థియేట్రికల్ కోసం డిస్ట్రిబ్యూటర్ల మధ్య భారీ పోటీ నెలకొందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన హక్కుల కోసం రూ.130 కోట్లకు పైగా మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మరో సినిమాగా రాజా సాబ్ నిలిచినట్లు తెలుస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రాజా సాబ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుని లాభాల్లోకి రావాలంటే రూ.200 కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉందని ఇప్పుడు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌ పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, ఇషాన్ సక్సేనా.. ది రాజా సాబ్ ను రూపొందిస్తున్నారు. దాదాపు 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నట్లు సమచారం. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా తీశారని వినికిడి.

మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బోమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, బ్రహ్మనందం, వీటీవీ గణేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌ ‌గా వ్యవహరిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా వర్క్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే రాజా సాబ్ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News