పాన్ ఇండియా సంచ‌ల‌నం వాయిదా త‌ప్ప‌దా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయకుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంతో `ది రాజాసాబ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-08-24 06:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయకుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంతో `ది రాజాసాబ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ విష‌యంలో జాప్యం ఏ స్థాయిలో జ‌రిగిందో కూడా విధిత‌మే. ఏడాది ఆరంభం నుంచి ఇదిగో రిలీజ్ ..అదిగో రిలీజ్ అనే ప్ర‌చారం త‌ప్ప ఇంత వ‌ర‌కూ రిలీజ్ సాధ్య‌ప‌డ‌లేదు. చివ‌రిగా ఇవేవి కాదంటూ డిసెంబ‌ర్ లో రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 5న రిలీజ్ డేట్ గా లాక్ చేసారు. ఎంతో కాన్పిడెంట్ గా చెప్పిన తేదీ ఇది. దీంతో ప్ర‌భాస్ ప్రేక్ష‌కాభిమానులు ఆ తేదీకి ఫిక్సైపోయారు.

ప్లానింగ్ లో మార్పులు:

ఇంకా నాలుగు నెల‌లు స‌మ‌యం ఉంది అప్ప‌టికీ ఎలా లేద‌న్నా? అన్ని ప‌నులు పూర్తి చేసి రిలీజ్ చేయడం ఖాయంగా భావిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ కూడా ఓ కొలిక్కి వ‌చ్చిన నేపథ్యంలో డిలే కి ఆస్కారం ఉండద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. కానీ `రాజాసాబ్ ` 2026కి వాయిదా ప‌డుతుంద‌నే కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో కార్మికులు బంద్ నిర్వ‌హించ‌డం...రెండు వారాల పాటు ఎక్క‌డ షూటింగ్ లు అక్క‌డ నిలిచిపోవ‌డం తెలిసిందే. దీంతో చాలా సినిమాల ప్లానింగ్ అంతా మారిపోతుంది.

సీజీ కార‌ణంగా డిలే:

కొత్త‌గా రిలీజ్ తేదీలు మార్చుకోవాల్సి వ‌స్తోంది. ముందు వెనుక‌..వెనుక ముందు అవుతున్నాయిప్పుడు. అవ‌న్నీ అగ్ర హీరోల చిత్రాలే కావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో రాజాసాబ్ కి ఈ ర‌క‌మైన ఇబ్బందితో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లోనూ జాప్యం త‌లెత్తుంద‌నే విష‌యం లీక్ అయింది. సినిమాకు సీజీ వ‌ర్క్ కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతో డిసెంబ‌ర్ లోగా అవి పూర్త‌వుతాయా? లేదా? అన్న దానిపై క్లారిటీ రావ‌డం లేదు.

100 కోట్లు ప‌క్కా:

చేతిలో మూడు నెల‌లు స‌మ‌యం ఉన్నా? ప‌నుల‌న్నీ అప్ప‌టికి పూర్తవుతాయా? లేదా? అన్న దానిపై నెట్టింట చ‌ర్చ మొద‌లైంది. ర‌క‌ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రి ఈ ప్ర‌చారానికి మేక‌ర్స్ పుల్ స్టాప్ పెడ‌తారా? ఇలాగే కొన‌సాగిస్తారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం మారుతి మాత్రం రాజాసాబ్ ని వీలైనంత త్వ‌ర‌గా ముగించే ప‌నిలోనే బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా తొలిరోజు 100 కోట్ల ఓపెనింగ్స్ సాధిం చ‌డం ఖాయంగానే టీమ్ భావిస్తోంది. సినిమాపై బ‌జ్ ఎక్క‌డా త‌గ్గ‌ని సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News