ప్రభాస్, దిల్ రాజు.. ఈ దర్శకుడు సెట్టయితే పూనకాలు పక్కా!
ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సరైన దర్శకుడి కోసం వేట మొదలైందని, ఆ వేటలో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది.;
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒకదాని తర్వాత ఒకటి, భారీ బడ్జెట్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'ది రాజా సాబ్' విడుదలకు సిద్ధమవుతుండగా, ఫౌజీ సెట్స్‌పై ఉంది. వీటితో పాటు నెక్స్ట్ స్పిరిట్ స్టార్ట్ కానుండగా ఆ తరువాత 'సలార్-2', 'కల్కి-2' సీక్వెల్స్ కూడా చేయాల్సి ఉంది. ఇన్ని కమిట్‌మెంట్ల మధ్య, ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించి హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. అదే ప్రభాస్ దిల్ రాజు కాంబో.
నిజానికి, ప్రభాస్‌తో ఒక భారీ సినిమా చేయాలని నిర్మాత దిల్ రాజు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'మున్నా', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' వంటి చిత్రాలు వచ్చాయి. ప్రభాస్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక, అతనితో మరో మరో భారీ సినిమా చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా ఆయనకు ఎప్పుడో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సరైన దర్శకుడి కోసం వేట మొదలైందని, ఆ వేటలో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది.
ఆ దర్శకుడు మరెవరో కాదు, క్రియేటివ్ జీనియస్ సుకుమార్. 'పుష్ప'తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్, తన హీరోలను ఒక కొత్త కోణంలో, రా, రస్టిక్ క్యారెక్టరైజేషన్‌తో చూపించడంలో స్పెషలిస్ట్. అలాంటి దర్శకుడితో ప్రభాస్ లాంటి మాస్ ఐకాన్ కలిస్తే, ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వస్తున్నాయి.
ప్రభాస్, సుకుమార్ కాంబో సెట్ అవ్వాలని చాలా కాలంగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ మొదట్లో ఆర్య, జగడం తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయాలని చాలాసార్లు ప్రయత్నించినా, సరైన కథ కుదరలేదు. కానీ, ఇప్పుడు ఇద్దరూ పాన్ ఇండియా లెవెల్‌లో పీక్స్‌లో ఉన్నారు. ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు, సుకుమార్ ఇంటెన్స్ మేకింగ్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక సినిమాటిక్ ఈవెంట్ అవుతుంది. అయితే, ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్ లైనప్ కూడా 2026 వరకు టైట్‌గా ప్యాక్ అయి ఉంది. కాబట్టి, ఈ కాంబినేషన్ లేటెస్ట్ గాసిప్ ప్రకారం సెట్టయితే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టొచ్చు. ఏది ఏమైనా, ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.