• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ మహల్ నుంచి యుద్దంలోకి...

రాజ మహల్ నుంచి యుద్దంలోకి ప్రభాస్

| ముఖ్యంగా ప్రభాస్ తన ఫోకస్‌ను ‘ది రాజా సాబ్’ మీదనే ఎక్కువగా పెట్టిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-02 09:30 GMT

స్టార్‌గా ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎవరూ ఊహించని రీతిలో ఏకకాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతోనే దూసుకుపోతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ తన ఫోకస్‌ను ‘ది రాజా సాబ్’ మీదనే ఎక్కువగా పెట్టిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీనే ‘ది రాజా సాబ్’. హర్రర్ కామెడీ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా చాలా వరకూ టాకీ పార్టును సైతం కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్టుతో రానున్న ‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పుడు కూడా బ్రేకులు లేకుండా జరుగుతోంది. అయితే, ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొనడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అతడు లేని సన్నివేశాలను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. ఇందులో పేరున్న నటీనటులు, కొందరు ఆర్టిస్టులు పాల్గొంటున్నట్లు తెలిసింది.

‘ది రాజా సాబ్’ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఏం చేస్తున్నాడా అని అందరూ ఆలోచిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అతడు హను రాఘవపూడి రూపొందిస్తోన్న చిత్రంలో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఇందులో అతడిపై కీలకమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా షూట్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ మరో పది రోజుల పాటు సాగుతుందనే టాక్ వినిపిస్తోంది.

హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ కోసం ప్రముఖ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్లు వేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ పూర్తైన వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మళ్లీ ‘ది రాజా సాబ్’కే డేట్స్ కేటాయించినట్లు కూడా తెలిసింది. ఇలా అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించి తన పార్టును కంప్లీట్ చేసుకునేలా ప్రభాస్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మొత్తంగా ప్రభాస్ ఏకకాలంలోనే ఈ రెండు సినిమాలను పూర్తి చేసుకోబోతున్నాడట. ఇవి కంప్లీట్ అయిన తర్వాతనే ‘సలార్ 2’, ‘స్పిరిట్’ సినిమాలపై ఫోకస్ చేస్తాడని ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలిసింది. అంటే కనీసం ఏడాది ఒక్క సినిమా అయినా రిలీజ్ అయ్యేలా రెబెల్ స్టార్ ముందుకు సాగుతున్నాడు. అతడి లైనప్‌పై ఫ్యాన్స్ మాత్రం ఖుషీగానే ఉన్నారని చెప్పొచ్చు.

Tags:    
  • Prabhas 
  • Hanuraghavapudi 
  • Rajasaab 
  • Maruthi 
  • Rajasaablook 
  • Tollywood 
  • Kalki 
  • Spirit 
  • Rajasaabshooting 
  • Filmindustry 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS