గెస్ట్ రోల్స్ తో లాభమేంటి ప్రభాస్..?
ఐతే కన్నప్ప సినిమాలో ప్రభాస్ రోల్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచినా అసలు ప్రభాస్ ఇలాంటి రోల్స్ ఎందుకు చేస్తున్నాడు అన్న సందేహం రాకమానదు.;
రెబల్ స్టార్ ప్రభాస్ కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో సర్ ప్రైజ్ చేశారు. మంచు విష్ణు కన్నప్పకి ఈ రేంజ్ క్రేజ్ పాపులారిటీ వచ్చింది అంటే పైన ఉన్న ఆ శివుడి ఆశీస్సులు అయితే.. సినిమాకు జనాలు రావడానికి మాత్రం రుద్రుడు అదే ప్రభాస్ ఇమేజ్ అని చెప్పొచ్చు. మంచు విష్ణు ఇది ఆలోచించే ప్రభాస్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాడని అనుకుంటున్న వారు ఉన్నారు. ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ఇలా స్టార్స్ ఉన్నా టికెట్లు తెగాయంటే మాత్రం అది ప్రభాస్ వల్లే అని చెప్పొచ్చు. మంచు విష్ణు కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు.
ఐతే కన్నప్ప సినిమాలో ప్రభాస్ రోల్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచినా అసలు ప్రభాస్ ఇలాంటి రోల్స్ ఎందుకు చేస్తున్నాడు అన్న సందేహం రాక మానదు. గెస్ట్ రోల్స్ వల్ల ప్రభాస్ కి లాభం ఏంటి అని డౌట్ రాక తప్పదు. మంచు విష్ణు సినిమాకు ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రభాస్ కన్నప్ప కోసం ఈసారి తానే గెస్ట్ రోల్ చేశాడు. అంతేకాదు ఈ సినిమాలో నటించినందుకు ప్రభాస్ అసలేమాత్రం పారితోషికం తీసుకోలేదు.
బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటించడం.. అప్పటి నుంచి ప్రభాస్ తో మంచి రిలేషన్ ఏర్పడటం వల్ల మోహన్ బాబు వల్ల కూడా ప్రభాస్ కన్నప్ప చేశాడని చెప్పొచ్చు. ఐతే ప్రభాస్ కన్నప్పలో భాగం అవ్వడానికి వీటన్ని కన్నా బలమైన రీజన్ రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్పని మళ్లీ ఇన్నాళ్లకు మంచు విష్ణు ప్రయత్నించడం వల్ల ఆ సినిమాలో తాను భాగం అవ్వాలనే ఉద్దేశంతో ప్రభాస్ రుద్ర పాత్రలో నటించాడని చెప్పొచ్చు.
ఐతే ఇలాంటి పాత్రల వల్ల ప్రభాస్ కి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎంత సినిమాను టర్న్ చేసే రోల్ అయినా ప్రభాస్ సోలో సినిమాలు చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడతారు కానీ ఇలా గెస్ట్ రోల్స్ వల్ల ఫ్యాన్స్ పూర్తిగా సంతృప్తి చెందే ఛాన్స్ లేదు. మరి ప్రభాస్ ఇక మీదట మళ్లీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తాడా చేస్తే ఫ్యాన్స్ నుంచి ఎలాటి రెస్పాన్స్ వస్తుంది అన్నది చూడాలి. ప్రభాస్ తను కమిటైన సినిమాలను పూర్తి చేస్తే చాలని ఇలాంటి చిన్న చిన్న రోల్స్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదని రెబల్ ఫ్యాన్స్ కొందరు అభిప్రాయపడుతున్నారు.